Contact

Text

Sunday, 1 June 2014

అక్కడ పిల్ల.. ఇక్కడ పిల్లోడు!

క్రికెట్ అభిమానికి ఎప్పటికీ గుర్తుండే మ్యాచ్ ఏదైనా ఉందంటే.. అది నిన్న జరిగిన ఐపీఎల్ 7 క్వాలిఫయర్ 2 మ్యాచ్ . పంజాబ్ కింగ్స్ ఎలెవన్-చెన్నైసూపర్ కింగ్స్ లు వీరోచితంగా తలపడిన శుక్రవారం నాటి మ్యాచే ఇందుకు ఉదాహరణ. ఆ మ్యాచ్ ల్లో రెండు విధ్వంసకర ఇన్నింగ్స్ లు. ఒకటి పంజాబ్ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ ది అయితే.. రెండోది చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సురేష్ రైనాది. ఆ రెండు ఇన్నింగ్స్ ల వెనుక చాలా చిత్రమైన కారణాలే ఉన్నాయట.. సెహ్వాగ్ ఇన్నింగ్స్ కు అతని కుమారుడు ఆర్యవీర్ నే ప్రధాన కారణం.
 

ఎందుకు డాడీ ఊరికే అవుటవుతున్నావు? మీడాడీకి పరుగులు చేయడం చేతకాదంటూ స్కూల్ లో స్నేహితులు ఏడిపిస్తున్నారు' అంటూ కొద్ది రోజుల క్రితం సెహ్వాగ్ కు ఫోన్ చేసిన ఆర్యవీర్ వ్యక్తం చేసిన ఆవేదనకు ప్రతిఫలమే ఇది. 'నేను తప్పకుండా భారీ పరుగులు చేస్తా' అని చెప్పిన వీరూ..చెన్నైతో జరిగిన మ్యాచ్ లో రెచ్చిపోయి తన కుమారుడు గర్వపడేలా చేశాడు. కేవలం 58 బంతులను ఎదుర్కొన్న సెహ్వాగ్ 122 పరుగులు చేసి పంజాబ్ 226 భారీ స్కోరు చేయడంలో తోడ్పడ్డాడు. దీంతో పంజాబ్ తిరుగులేని విజయాన్ని సాధిస్తుందని అంతా భావించారు.
 
కాగా, ఛేజింగ్ తో బరిలోకి దిగిన చెన్నై మాత్రం గెలిచేంత పనిచేసింది. డుప్లిసెస్ తొలి ఓవర్లనే అవుటయ్యి అభిమానులను నిరాశపరిచినా.. రైనా తుఫాను వేగంతో ఆడిన తీరు మాత్రం నిజంగా వెలకట్టలేనిదే. కేవలం 25 బంతులను మాత్రమే ఎదుర్కొన్న రైనా 12 ఫోర్లు, 6 సిక్స్ లతో 87 పరుగులు చేశాడు. దీని ఫలితంగా చెన్నై ఆరు ఓవర్లనే 100 పరుగులు చేసింది. రైనా సూపర్ ఇన్నింగ్స్ లు ఆడుతూ ముందుకు వెళ్లడానికి కూడా కారణం ఉందట.
 
విశ్వవిఖ్యాత నటుడు కమల్ హాసన్ కుమార్తె శ్రుతి హాసన్ ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ ఏస్ బ్యాట్స్ మన్ సురేష్ రైనాతో రొమాన్స్ చేయడమేనట. రైనా ఎక్కడ మ్యాచ్ ఆడినా అక్కడకు వెళ్తూ చెన్నై టీంకు తన మద్దతు పలుకుతూ ఐపీఎల్-6 సీజన్ లో ఈ చిన్నది సందడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అది మరింత దూరం వెళ్లి వీళ్లిద్దరి రొమాన్స్ కు దారితీసిందని ఒక జాతీయ పత్రిక తెలిపింది. సాధారణంగా శ్రుతి వచ్చిందంటే చాలు.. రైనా రెచ్చిపోయి ఆడేవాడట. ఈసారి ఆమె మైదానాలకు రాకపోయినా రైనా రెచ్చిపోయి ఆడటానికి శ్రుతినే కారణమనే ఊహాగానాలు హల్ చల్ చేస్తున్నాయి.
21:50 - By Unknown 0

విడాకుల మూల్యం రూ. 27 వేల కోట్లు..



చరిత్రలోనే అత్యంత ఖరీదైన విడాకుల వ్యవహారం ఇది. విడాకుల వివాదం సెటిల్మెంట్ కోసం అక్షరాలా రూ. 27 వేల కోట్లు భార్యకు చెల్లించాలంటూ రష్యాకు చెందిన వ్యాపారవేత్త దిమిత్రీ రైబొలొవ్లెవ్‌ను అక్కడి కోర్టు ఆదేశించింది. ఆయన ఆస్తి విలువ సుమారు రూ. 52,800 కోట్లు ఉంటుంది. దాదాపు ఆరేళ్ల నుంచి ఈ కేసు కొనసాగుతోంది.  

ఇలాంటివే మరికొన్ని భారీ విడాకుల కేసులు కూడా ఉన్నాయి. ఫ్రెంచ్ వ్యాపారవేత్త అలెక్ వెల్డైన్‌స్టెయిన్ డైవోర్స్ తీసుకున్నప్పుడు భార్య జోసెలిన్‌కి దాదాపు రూ. 15,000 కోట్లు ఇవ్వాల్సి వచ్చింది. అలాగే, మీడియా దిగ్గజం రూపర్ట్ మర్డోక్ తన మాజీ భార్య ఆనాకి సుమారు రూ. 10,000 కోట్లు ఇచ్చారు.

ఇదే కోవలో ఫార్ములా వన్ ప్రెసిడెంట్ బెర్నీ ఎక్లిస్టోన్ తన మాజీ భార్య స్లావికా నుంచి విడాకుల కోసం రూ. 9,000 కోట్లు వెచ్చించాల్సి వచ్చింది. హాలీవుడ్ స్టార్ మెల్ గిబ్సన్ కూడా భార్య రాబిన్ నుంచి విడిపోయినప్పుడు రూ. 2,000 కోట్లు పైగా ఇవ్వాల్సి వచ్చింది.
 
21:35 - By Unknown 0

శింబు మొబైల్లో నయన ఫొటో

కొందరు తారలు  ఏం చేసినా అవి కలకలం రేపుతాయి. అలాంటి వారిలో సినిమా రంగానికి సంబంధించి శింబు, నయనతార ముందుం టారు. అందుకే వాళ్లు సంచలనాలకు కేంద్ర బిందువుగా మారారు. శింబు, నయనతార ఒకప్పుడు ప్రేమికులన్న విషయం తెలిసిం దే. వారలా గాఢంగా ప్రేమలో లీనమై ఫొటోలు అప్పట్లో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేసి కలకలం సృష్టించారుు. నయనతార జీవితంలో కల్లోలం పుట్టించింది కూడా ఈ ఫొటో ఉదంతమే. ఆ ఫొటోను శింబునే కావాలని ఇంటర్నెట్‌లో ప్రచారం చేశారన్న భావనతో నయనతార ఆయనకు దూరం అయ్యారు. ఆ తరువాత ఆమె ప్రభుదేవా ప్రేమలో, శింబు హన్సిక లవ్‌లో పడ్డారు. ఈ ప్రేమ కథలు కంచికే చేరాయి.
 

 ప్రస్తుతం శింబు మాజీ ప్రేయసి నయనతారతో మళ్లీ కలిసి నటించడం విశేషం. ఎవరినయినా ప్రేమిస్తానుగానీ శింబును మాత్రం జీవితంలో క్షమించనన్న నయనతార ప్రస్తుతం ఆయనతో సన్నిహితంగా ఉండడం సినీ వర్గాలకే షాక్ కలిగిస్తున్న అంశం. ప్రస్తుతం ఇదు నమ్మ ఆళు చిత్రంలో నటిస్తున్న ఈ సంచలన జంటపై కోడంబాక్కంలో రకరకాల ప్రచారం జరుగుతోంది. అసలు విషయం ఏమిటంటే శింబు ఇటీవల నయనతారతో సన్నిహితంగా ఉండే ఫొటోను తన సెల్‌ఫోన్‌లో బంధించి దాన్ని మరోసారి ఇంటర్నెట్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం నెట్‌లో హల్‌చల్ చేస్తున్న ఈ ఫొటో కథ ఎటు దారి తీస్తుందోనంటున్నాయి కోలీవుడ్ వర్గాలు.  
21:30 - By Unknown 1

దేశానికి మంచి రోజులొచ్చాయి: సోనాక్షి


ముంబై: కేంద్రంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం పట్ల బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా సంతోషం వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి రావడంతో దేశానికి మంచి రోజులు వచ్చాయని చెప్పారు. సోనాక్షి తండ్రి బీజేపీ నేత శత్రుఘ్న సిన్హా లోక్ సభకు ఎంపికయ్యారు.

బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చినందుకు తమకు సంతోషంగా ఉందని, ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో మార్పులు తీసుకువస్తుండటం శుభపరిణామమని సోనాక్షి చెప్పారు. మోడీ మంత్రి వర్గంలో ఏడుగురి మహిళలకు స్థానం కల్పించడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. కాగా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ విద్యార్హతపై చెలరేగిన వివాదంపై స్పందించేందుకు నిరాకరించారు. తమ ఇంట్లో సినిమాలు, రాజకీయాల గురించి అరుదుగా మాట్లాడుతామని సోనాక్షి చెప్పారు.
11:18 - By Unknown 0

మోడీకి కెప్టెన్ లేఖాస్త్రం!


నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్స వం నిమిత్తం ఢిల్లీకి వెళ్లి భంగపాటుకు గురయ్యూరు డీఎండీకే అధినేత విజయకాంత్. తన బావమరిది సుదీష్‌కు పదవి దక్కక పోవడంతో కినుకు వహించిన విజయకాంత్, మోడీ, రాజ్‌నాథ్ సింగ్‌లతో భేటీకి తీవ్రంగానే యత్నించారు. అపాయింట్‌మెంట్లు లభించక పోవడంతో చెన్నైకు తిరిగి వచ్చేసిన విజయకాంత్ తదుపరి తన కార్యాచరణ మీద దృష్టి పెట్టారు. బీజేపీ కూటమిలోనే కొనసాగాలా? లేదా వారు పెట్టిన మెలిక మేరకు విలీనం చేయాలా? అని తదుపరి అడుగులు ఎటో తేల్చుకునేం దుకు ఈనెల నాలుగో తేదీన పార్టీ ఉన్నత స్థాయి సమావేశానికి పిలుపునిచ్చారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలితకు ప్రధాని నరేంద్ర మోడీ నుంచి ఆహ్వానం రావడంతో మేల్కొన్న విజయకాంత్ ముందుగానే రాష్ట్రంలోని సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లే పనిలో పడ్డా రు.
 
 ఇది వరకు ప్రధాన మంత్రులకు లేఖాస్త్రాలతో సమస్యలను నివేదించడం రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలితకు అందెవేసిన చేయి. తాజాగా ఆ బాటలో విజయకాంత్ నడిచేందుకు సిద్ధం అవుతున్నారు. శనివా రం రాష్ట్రంలోని సమస్యలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఏకరువు పెడు తూ మోడీకి లేఖాస్త్రం సంధించారు. లేఖాస్త్రం: తమిళనాడులో ప్రజలు  తాగు నీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారని వివరించారు. నగరాలు, గ్రామాల్లో నీటి ఎద్దడి తాండవం చేస్తున్నదని, ఈ సమస్య పరిష్కారానికి నిధులు కేటాయిం చాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కరువు ప్రభావంతో కొన్నేళ్లుగా అన్నదాతలు కన్నీటి మడగులో మునిగి ఉన్నారని వివరించారు. నదీ జలాలు సక్రమంగా అందక డెల్టా రైతులు, వర్షాభావ పరిస్థితుల్లో దక్షిణాది రైతులు అప్పుల ఊబిలో కూరుకు పోయూరని ఆవేదన వ్యక్తం చేశారు. వీరిని ఆదుకునే రీతిలో, నదుల అనుసంధానానికి తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.
 
 తమిళనాడులో విద్యుత్ సమస్య తాండవం చేస్తున్నదని వివరిస్తూ, కేంద్ర ప్రభుత్వ కోటాను మరింతగా పెంచాలని విజ్ఞప్తి చేశారు. దక్షిణ తమిళనాడు సముద్ర తీరాల్లో ఖనిజ సంపద దోపిడీకి గురవుతోందని, తద్వారా కేంద్రానికి పెను నష్టం ఏర్పడుతున్నదని వివరిస్తూ, ఈ సంపదను పరిరక్షించే చర్య లు చేపట్టాలని విన్నవించారు. జాలర్లపై దాడులకు అడ్డుకట్ట వేయాలని కోరుతూ, మిత్ర దేశం శ్రీలంకపై ఒత్తిడి పెంచి భారత దేశాన్ని గౌరవించే విధంగా దారిలో పెట్టాలని సూచించారు. ఈలం తమిళులను ఆదుకునేందుకు చర్యలను వేగవంతం చేయించాలని కోరారు. తమిళనాడులోని ప్రభుత్వ ఆస్పత్రుల స్థాయిని పెంచడం, అత్యధికంగా నిధులను కేటాయించడం, ఉన్నత విద్య గ్రామీణ విద్యార్థుల దరి చేర్చ డం, జాతీయ రహదారులు పటిష్టం తది తర అంశాల గురించి వివరిస్తూ లేఖాస్త్రాన్ని విజయకాంత్ సంధించారు.
 
11:17 - By Unknown 0

మెగా విబేధాల నేపథ్యంలోనే...



శ్రీను వైట్లు ఆగడు టీజర్ లో పవన్ పై సెటైరికల్ డైలాగు పేల్చడం వెనకు మెగా ఫ్యామిలీ విబేధాలు ధైర్యాన్నిచ్చియని వినికిడి. మహేష్ సినిమా పూర్తయిన తరువాత శ్రీను సినిమా రామ్ చరణ్ తోనే.  తన హీరోను హ్యాపీగా ఫీల్ కావడం కోసమే మహేష్ చేత ఈ డైలాగ్ చెప్పించాడని, ఇదంతా బతకనేర్చిన వ్యవహారం తప్ప మరోటి కాదని పవన్ అభిమానులు గుస్సాయిస్తున్నారు. ఇదిలా వుంటే ఫిలిం పర్సనాలిటీలపై తన సినిమాల్లో సెటైర్లు వేయడం, ఆ తరువాత వారిని ఉద్దేశించి కాదని అనడం వైట్లకు అలవాటే అన్న కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. 
01:10 - By Unknown 0

narrowsidebarads

Post your AD here 300x250 AD TOP

...
© 2014 HOT NEWS. WP Theme-junkie converted by Bloggertheme9
Powered by Blogger.
back to top