Contact

Text

Showing posts with label CRICKET. Show all posts
Showing posts with label CRICKET. Show all posts

Sunday, 1 June 2014

అక్కడ పిల్ల.. ఇక్కడ పిల్లోడు!

క్రికెట్ అభిమానికి ఎప్పటికీ గుర్తుండే మ్యాచ్ ఏదైనా ఉందంటే.. అది నిన్న జరిగిన ఐపీఎల్ 7 క్వాలిఫయర్ 2 మ్యాచ్ . పంజాబ్ కింగ్స్ ఎలెవన్-చెన్నైసూపర్ కింగ్స్ లు వీరోచితంగా తలపడిన శుక్రవారం నాటి మ్యాచే ఇందుకు ఉదాహరణ. ఆ మ్యాచ్ ల్లో రెండు విధ్వంసకర ఇన్నింగ్స్ లు. ఒకటి పంజాబ్ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ ది అయితే.. రెండోది చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సురేష్ రైనాది. ఆ రెండు ఇన్నింగ్స్ ల వెనుక చాలా చిత్రమైన కారణాలే ఉన్నాయట.. సెహ్వాగ్ ఇన్నింగ్స్ కు అతని కుమారుడు ఆర్యవీర్ నే ప్రధాన కారణం.
 

ఎందుకు డాడీ ఊరికే అవుటవుతున్నావు? మీడాడీకి పరుగులు చేయడం చేతకాదంటూ స్కూల్ లో స్నేహితులు ఏడిపిస్తున్నారు' అంటూ కొద్ది రోజుల క్రితం సెహ్వాగ్ కు ఫోన్ చేసిన ఆర్యవీర్ వ్యక్తం చేసిన ఆవేదనకు ప్రతిఫలమే ఇది. 'నేను తప్పకుండా భారీ పరుగులు చేస్తా' అని చెప్పిన వీరూ..చెన్నైతో జరిగిన మ్యాచ్ లో రెచ్చిపోయి తన కుమారుడు గర్వపడేలా చేశాడు. కేవలం 58 బంతులను ఎదుర్కొన్న సెహ్వాగ్ 122 పరుగులు చేసి పంజాబ్ 226 భారీ స్కోరు చేయడంలో తోడ్పడ్డాడు. దీంతో పంజాబ్ తిరుగులేని విజయాన్ని సాధిస్తుందని అంతా భావించారు.
 
కాగా, ఛేజింగ్ తో బరిలోకి దిగిన చెన్నై మాత్రం గెలిచేంత పనిచేసింది. డుప్లిసెస్ తొలి ఓవర్లనే అవుటయ్యి అభిమానులను నిరాశపరిచినా.. రైనా తుఫాను వేగంతో ఆడిన తీరు మాత్రం నిజంగా వెలకట్టలేనిదే. కేవలం 25 బంతులను మాత్రమే ఎదుర్కొన్న రైనా 12 ఫోర్లు, 6 సిక్స్ లతో 87 పరుగులు చేశాడు. దీని ఫలితంగా చెన్నై ఆరు ఓవర్లనే 100 పరుగులు చేసింది. రైనా సూపర్ ఇన్నింగ్స్ లు ఆడుతూ ముందుకు వెళ్లడానికి కూడా కారణం ఉందట.
 
విశ్వవిఖ్యాత నటుడు కమల్ హాసన్ కుమార్తె శ్రుతి హాసన్ ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ ఏస్ బ్యాట్స్ మన్ సురేష్ రైనాతో రొమాన్స్ చేయడమేనట. రైనా ఎక్కడ మ్యాచ్ ఆడినా అక్కడకు వెళ్తూ చెన్నై టీంకు తన మద్దతు పలుకుతూ ఐపీఎల్-6 సీజన్ లో ఈ చిన్నది సందడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అది మరింత దూరం వెళ్లి వీళ్లిద్దరి రొమాన్స్ కు దారితీసిందని ఒక జాతీయ పత్రిక తెలిపింది. సాధారణంగా శ్రుతి వచ్చిందంటే చాలు.. రైనా రెచ్చిపోయి ఆడేవాడట. ఈసారి ఆమె మైదానాలకు రాకపోయినా రైనా రెచ్చిపోయి ఆడటానికి శ్రుతినే కారణమనే ఊహాగానాలు హల్ చల్ చేస్తున్నాయి.
21:50 - By Unknown 0

Friday, 16 May 2014

ప్రీతి జింటా ని ఎక్కడో తాకారట!

         prithi

సొట్ట బుగ్గల బాలీవుడ్ సుందరి ప్రీతి జింటా ఐ పి ఎల్ లో పంజాబ్ ఎలెవన్ కింగ్స్ ఓనర్ అనే విషయం తెలిసిందే. ఐ పి ఎల్ క్రికెట్ పోటీ లు జరుగుతుండటం తో ఓనర్ అయిన ప్రీతి జింటా సదరు మ్యాచ్ లకు హాజరై ఆటగాళ్ళలో జోష్ ని నింపడానికి ప్రయత్నాలు చేస్తోంది ఐతే అక్కడే సమస్య వస్తోందట. ప్రీతి జింటా హీరోయిన్ కూడా కావడంతో ఆటని తిలకించడానికి వచ్చిన ప్రేక్షకులు ప్రీతి జింటా ని కలవడానికి ,కరచాలనం చేయడానికి ముందుకు వస్తూ విపరీతమైన అభిమానం చూపిస్తుండటం తో ప్రీతి కి ఇబ్బందిగా ఉందట ఎందుకంటే ఉత్సాహం ఎక్కువై ప్రీతి శరీరంపై ఎక్కడెక్కడో చేతులు వేసి తాకుతున్నారట!ఇది ఇబ్బందిగా ఉన్నప్పటికీ వాళ్ళంతా నా అభిమానులే కానీ ఉత్సాహం మరీ ఎక్కువై ఇలా చేస్తున్నారని వాపోతుంది ప్రీతి జింటా. ఈ విషయాన్నీ ట్విట్టర్ లో పేర్కొన్నది.
23:07 - By Unknown 0

Saturday, 5 April 2014

Virender Sehwag's Highest score in each Format.

Virender Sehwag's Highest score in each Format.
T20s - 119
ODIs - 219
Tests - 319
Only VIRU lovers will Share this 

10:43 - By Unknown 0

The boy who was broken into tears in Last T20 World Cup



The boy who was broken into tears in Last T20 World Cup when his Team failed to Qualify for semifinals. Everyone made fun of Him.

But yesterday he played against the same Team and made sure that his Team Qualifies for the FINALS!
Hatsss off VIRAT KOHLI!

BET...Every True CRICKET Lovers will SHARE this post..

10:41 - By Unknown 0

Saturday, 29 March 2014

India No:1

02:19 - By Unknown 0

Friday, 28 March 2014

సెమీఫైనల్ కు దూసుకెళ్లిన టీమిండియా

సెమీఫైనల్ కు దూసుకెళ్లిన టీమిండియా
మిర్పూర్: టీమిండియా ఖాతాలో మరో విజయం చేరింది. ట్వంటీ 20 వరల్డ్ కప్ లో భాగంగా శుక్రవారం బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించి సెమీఫైనల్ కు దూసుకెళ్లింది. బంగ్లా విసిరిన 139 పరుగుల లక్ష్యాన్ని టీం ఇండియా ఆటగాళ్లు 18.3 ఓవర్లో ఛేదించారు. ఆదిలోనే ఓపెనర్ శిఖర్ థావన్ (1) పరుగుకే పెవిలియన్ చేరినా, మరో ఓపెనర్ రోహిత్ శర్మ (56) పరుగులతో ఆకట్టుకున్నాడు. అతనికి తోడు విరాట్ కోహ్లి (56*) పరుగులతో చేసి భారత్ విజయానికి సహకరించాడు.  చివర్లో కెప్టెన్ ధోని సిక్సర్ తో ఇన్నింగ్స్ ను ముగించాడు. ఈ మ్యాచ్ లో ఓటిమితో బంగ్లాదేశ్ మాత్రం సెమీస్ ఆశలను దాదాపు చేజార్చుకుంది.

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన బంగ్లా నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లకు 138 పరుగులు చేసింది. భారత ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ ఆరంభంలోనే బంగ్లాను కట్టడి చేశాడు. అశ్విన్ వరుస బంతుల్లో తమీమ్ ఇక్బాల్, షమ్సూర్ రహ్మాన్ ను పెవిలియన్ చేర్చాడు. ఆ మరుసటి ఓవర్లో యువ పేసర్ భువనేశ్వర్ కుమార్ షకీబల్ ను బౌల్డ్ చేశాడు. దీంతో బంగ్లా 21 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.  ఆ తర్వాత బంగ్లా రన్ రేట్ మందగించింది. అనముల్ హక్ (44), ముష్ఫికర్ రహీం (24) బంగ్లాను ఆదుకునే ప్రయత్నం చేశారు. కాగా భారత బౌలర్ షమీ.. రహీంను అవుట్ చేయగా.. ఆ వెంటనే అమిత్ మిశ్రా అనముల్ ను బౌల్డ్ చేశారు. చివర్లో భారత బౌలర్లు ఇదే జోరు కొనసాగించలేకపోయారు. మహ్మదుల్లా (33 నాటౌట్), నాసిర్ హుస్సేన్ (16) రాణించి బంగ్లాకు సముచిత స్కోరు అందించారు.
10:52 - By Unknown 0

Thursday, 27 March 2014

Suspend Rajasthan Royals and CSK from IPL 7 - Supreme Court


Supreme Court has suggested that Rajasthan Royals and Chennai Super Kings (CSK) be barred from the Indian Premier League Season 7. It also proposed that Indian batting legend Sunil Gavaskar should take over from N Srinivasan and be made interim president of the Board of Control for Cricket in India till it announces its final verdict in the matter. It further said any person associated with Indian Cements, the owners of Chennai Super Kings franchise, should not be involved with the BCCI. It has given the BCCI a 24-hour deadline to respond to the proposals. The Supreme Court said it will pass the interim order on the IPL spot-fixing and betting scandal on Friday at 1030 IST.
The Supreme Court on Tuesday urged Srinivasan to stand down while an investigation is conducted into illegal betting, saying his refusal to quit so far was 'nauseating'. A two-judge panel warned it could order the BCCI chief, regarded as the most powerful man in world cricket, to stand down unless he did so voluntarily as his continued presence in his post was hampering the investigation which involves his son-in-law. The bench was looking at a damning report that it commissioned last year into wrongdoing in the IPL following a betting and spot-fixing scandal that rocked the domestic Twenty20 tournament. The report, released in February, concluded that Srinivasan's son-in-law Gurunath Meiyappan could be guilty of illegal betting on IPL games, in a major blow to Srinivasan who is due to take over as head of the International Cricket Council in July. Meiyappan was the team principal of Chennai Super Kings, an IPL franchise owned by Srinivasan's India Cements company and captained by national skipper Mahendra Singh Dhoni.
11:32 - By Unknown 0

బీసీసీఐ అధ్యక్ష పదవిని చేపట్టడానికి రెఢీ: గవాస్కర్



NewsListandDetails
న్యూఢిల్లీ:  బీసీసీఐ అధ్యక్ష పదవిని చేపట్టడానికి తాను సిద్దమేనని క్రికెటర్, మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ తెలిపారు. అధ్యక్ష పదవిని చేపట్టడం తనకు లభించిన గౌరవంగా భావిస్తానని ఆయన అన్నారు. సుప్రీం కోర్టు ఆదేశిస్తే సంతోషంగా పదవిని చేపట్టడుతానన్నారు. ప్రస్తుతం కామెంటేటర్ గా పనిచేయడానికి బీసీసీఐ ఒప్పందం కుదుర్చుకున్నానని ఆయన తెలిపారు.
 
సుప్రీం కోర్టు అధికారికంగా ఆదేశిస్తే అధ్యక్ష పదవిని చేపట్టడానికి రెడీ అని అన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలు వచ్చే వరకు వేచి చూస్తానని ఆయన అన్నారు. ఓపెనర్ బ్యాట్స్ మెన్ గా అన్ని రకాలైన సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటానని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.
 
ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంపై విచారణ పూర్తయ్యే వరకు ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ ను తొలగించి.. సునీల్ గవాస్కర్ కు బాధ్యతలు అప్పగించాలని సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.
11:21 - By Unknown 0

హేల్స్ సూపర్ సెంచరీ:ఇంగ్లండ్ ఘన విజయం

హేల్స్ సూపర్ సెంచరీ:ఇంగ్లండ్ ఘన విజయం
చిట్టగాంగ్: ట్వంటీ 20 వరల్డ్ కప్ లో మరో ఆసక్తి పోరుకు తెరలేచింది. శ్రీలంకతో గురువారం ఇక్కడ జరిగిన డే అండ్ నైట్ మ్యాచ్ లో ఇంగ్లండ్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.  ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో ఇంగ్లండ్ సూపర్ ఫాంను కొనసాగించి లంకేయులకు షాకిచ్చింది. శ్రీలంక విసిరిన 190 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ ఇంకా నాలుగు బంతులుండగానే ఛేదించింది. తొలి ఓవర్ లోనే రెండు వికెట్లు కోల్పోయి తడబడిన ఇంగ్లండ్ ఇన్నింగ్స్ కు హేల్స్ అబేధ్యమైన సెంచరీతో జట్టు గెలుపును సునాయాసం చేశాడు. ఆదిలో లంబ్ (0), ఆలీ(0), వికెట్లు కోల్పోయినా,  హేల్స్  మాత్రం లంకేయులకు చుక్కలు చూపించాడు. ఓపెనర్ గా వచ్చిన హేల్స్(116) పరుగులతో చివరి వరకూ క్రీజ్ లో ఉండి ఇంగ్లండ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. అతనికి మోర్గాన్ (57) పరుగులతో చక్కటి సహకారం అందించడంతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. శ్రీలంక బౌలర్లలో కులశేఖర నాలుగు వికెట్లతో ఆకట్టుకున్నాడు.
 
టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత శ్రీలంకను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ ఆరంభించిన లంకేయులకు ఆదిలోనే పెరీరా(3) ను వికెట్టును చేజార్చుకుని కష్టాల్లో పడినట్లు కనిపించింది.  ఆ తరుణంలో మరో ఓపెనర్ దిల్షాన్ కు జయవర్దనే జత కలవడంతో  జట్టు స్కోరు నెమ్మదిగా ముందుకు కదిలింది. ఇరువురూ ఆచితూచి ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు తీసుకువెళ్లారు. దిల్షాన్ (55), జయవర్దనే(89) పరుగులతో ఆకట్టుకుని శ్రీలంకకు  మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
 
చివరిలో తిషారా పెరీరా(23)  బాధ్యతగా ఆడటంతో శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో జోర్డాన్, డెర్న్ బ్యాచ్ చెరో రెండు వికెట్లు లభించాయి.
11:01 - By Unknown 0

Wednesday, 26 March 2014

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు మరో గౌరవం

‘డిజిటల్’ మాస్టర్
అభిమానుల ఫొటోలతో సచిన్ ఛాయాచిత్రం
 ముంబై: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు మరో గౌరవం దక్కింది. 17 వేల మందికిపైగా అభిమానుల ఛాయాచిత్రాలను ఉపయోగించి అతిపెద్ద డిజిటల్ సచిన్ ఫొటోను జపాన్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ తొషిబా రూపొందించింది. ప్రపంచ క్రికెట్‌లో ఇప్పటిదాకా ఏ క్రికెటర్‌కి ఈ గౌరవం దక్కలేదు. ముంబైలో జరిగిన ఆవిష్కరణ కార్యక్రమంలో మాస్టర్ తన డిజిటల్ ఫొటోను స్వయంగా ఆవిష్కరించాడు.

గత జనవరి నుంచి తొషిబా సోషల్ మీడియాలో ‘వుయ్ ఆర్ సచిన్’ పేరుతో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించింది. దీనికి అభిమానుల నుంచి అనూహ్య స్పందన లభించింది. వారి ఫొటోలతోనే తొషిబా కంపెనీ సచిన్ ఛాయాచిత్రాన్ని రూపొందించింది. ‘సోషల్ మీడియాలో తొషిబా నిర్వహించిన ప్రచారానికి అద్భుతమైన స్పందన వచ్చింది. నా ముఖాన్ని రూపొందించేందుకు 17వేల మందికిపైగా అభిమానుల ఛాయాచిత్రాలను ఉపయోగించారు. ఈ ఛాయాచిత్రం హృదయాన్ని హత్తుకునేలా ఉంది. ఫొటోలో వెనకాల మువ్వన్నెల జెండా రంగులు ఉన్నాయి. ఇంతకు మించింది మరొకటి ఉండదు’ అని సచిన్ అన్నాడు.
21:59 - By Unknown 0

Tuesday, 25 March 2014

TENDULKAR and PONTING Rare Pics







































07:15 - By Unknown 0

IPL 2014 Costly Players

06:13 - By Unknown 0

ఐపీఎల్-7 షెడ్యూల్: ఏప్రిల్ 16 నుంచి జూన్ 1 వరకు

ముంబై, మార్చి 12 : ఐపీఎల్-7 షెడ్యూల్ ఎట్టకేలకు ఖరారైంది. ఏప్రిల్ 16 నుంచి మే 30 వరకు మూడు విడతలుగా ఐపీఎల్-7 మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఏప్రిల్ 16 నుంచి మే 30 వరకు దుబాయ్‌లో తొలి విడత మ్యాచ్‌లు, మే 1 నుంచి 12 వరకు భారత్ లేదా బంగ్లాదేశ్‌లలో మ్యాచ్‌లు జరుగనున్నాయి.
మే 13 నుంచి జూన్ 1 వరకు భారత్‌లో మూడో విడత మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఎన్నికల దృష్ట్యా ఐపీఎల్‌కు భద్రత కల్పించలేమని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే ప్రకటించిన నేపథ్యంలో సౌతాఫ్రికాలో టోర్నమెంటు నిర్వహించేందుకు బీసీసీఐ యత్నించింది. అయితే అది కూడా కుదరని పక్షంలో మ్యాచ్‌లను దుబాయ్‌లో నిర్వహించేందుకు బీసీసీఐ నిర్ణయించింది. కాగా మే 1 తర్వాత ఎన్నికలు ముగిసిన ప్రాంతాల్లో మ్యాచ్‌లకు అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని బీసీసీఐ కోరినట్లు తెలుస్తోంది.
06:10 - By Unknown 0

T20 Points List 2014 World Cup

                                    
01:07 - By Unknown 0

Monday, 24 March 2014

గంభీర్‌తో ఓపెనర్‌గా మళ్లీ వస్తా: సెహ్వాగ్‌


న్యూఢిల్లీ: మళ్లీ భారత జాతీయ జట్టులో చోటు దక్కించుకుంటానని, తన బెస్ట్‌ పాట్నర్‌ గౌతమ్‌ గంభీర్‌తో జాతీయ జట్టుకు ఓపెనర్‌గా తిరిగి వస్తానని డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. గంభీర్‌తో టెస్టుల్లో చాలా కాలం ఓపెనింగ్‌ చేశానన్నాడు. తొలుత ఐపిఎల్‌లో ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ జట్టులో కూడా ఇద్దరం కలిసే ఆడామని చెప్పాడు. తాను భారత జాతీయ జట్టుకు ఆడుతూ మళ్లీ గంభీర్‌తో ఓపెనింగ్‌ చేయాలని అశిస్తున్నట్లు తెలిపాడు. తాను తిరిగి టీమిండియా జట్టులోకి వచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు సెహ్వాగ్‌ అన్నాడు. ఆటగాళ్లందరికీ వేలం ఉంచడం వల్ల కలిస్‌, యువరాజ్‌ సింగ్‌ లాంటి మంచి ఆటగాళ్లను కొనుగోలు చేసే అవకాశం ఫ్రాంచైజీలకు దక్కిందన్నాడు. అయితే అన్ని ఫార్మెట్‌లలోనూ  గౌతమ్‌ గంభీర్‌తో కలిసి ఆడాలనుకుంటున్నట్లు చెప్పాడు. తాను రిటై ర్మెంట్‌ ప్రకటించే ముందు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం వస్తుందని సెహ్వాగ్‌ విశ్వాసం వ్యక్తం చేశాడు.
03:42 - By Unknown 0

Saturday, 22 March 2014

ట్వంటీ 20 వరల్డ్ కప్ లో శ్రీలంక బోణీ

ట్వంటీ 20 వరల్డ్ కప్ లో శ్రీలంక బోణీ
చిట్టగాంగ్: ట్వంటీ 20 వరల్డ్ కప్ లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో శ్రీలంక బోణీ కొట్టింది. కట్టుదిట్టమైన బౌలింగ్ తో ఆకట్టుకున్న లంకేయులు ఐదు పరుగుల తేడాతో సఫారీలను కంగుతినిపించారు.  లంకేయులు విసిరిన 166 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలోసఫారీలు చేతులెత్తేశారు. దక్షిణాఫ్రికా ఓపెనర్లు కాక్ (25), ఆమ్లా (23) పరుగులతో ఫర్వాలేదనిపించారు. అనంతరం డుమినీ(39),డివిలియర్స్(24) పరుగులు చేసి జట్టును గాడిలో పెట్టేందుకు యత్నించారు. కాగా చివరి వరుస ఆటగాళ్లు  విఫలం కావడంతో దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 160 పరుగులకు మాత్రమే పరిమితమై ఓటమి పాలైంది. శ్రీలంక బౌలర్లలో సేననాయకే రెండు వికెట్లు తీయగా, మాథ్యూస్, మలింగా, కులశేఖరాలకు తలో వికెట్టు లభించింది.

టాస్ గెలిచిన లంకేయులు తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఓపెనర్ దిల్షాన్(0)పరుగులేమీ చేయకుండా పెవిలియన్ చేరి ఆదిలోనే లంకను నిరాశపరిచాడు. మరో ఓపెనర్ పెరీరా మాత్రం ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లాడు. పెరీరా ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లతో  61 పరుగులు చేసి లంక ఇన్నింగ్స్ కు జీవం పోశాడు. అనంతరం జయవర్ధనే(9), సంగక్కారా(14) పరుగులు మాత్రమే చేసి లంకను మరోసారి కష్టాల్లోకి నెట్టారు.ఈ క్రమంలో క్రీజ్ లోకి మాథ్యూస్ (43) పరుగులు చేయడంతో  లంకేయులు 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేశారు.


06:33 - By Unknown 0

narrowsidebarads

Post your AD here 300x250 AD TOP

...
© 2014 HOT NEWS. WP Theme-junkie converted by Bloggertheme9
Powered by Blogger.
back to top