ముంబై: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు మరో గౌరవం దక్కింది. 17 వేల మందికిపైగా అభిమానుల ఛాయాచిత్రాలను ఉపయోగించి అతిపెద్ద డిజిటల్ సచిన్ ఫొటోను జపాన్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ తొషిబా రూపొందించింది. ప్రపంచ క్రికెట్‌లో ఇప్పటిదాకా ఏ క్రికెటర్‌కి ఈ గౌరవం దక్కలేదు. ముంబైలో జరిగిన ఆవిష్కరణ కార్యక్రమంలో మాస్టర్ తన డిజిటల్ ఫొటోను స్వయంగా ఆవిష్కరించాడు.
గత జనవరి నుంచి తొషిబా సోషల్ మీడియాలో ‘వుయ్ ఆర్ సచిన్’ పేరుతో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించింది. దీనికి అభిమానుల నుంచి అనూహ్య స్పందన లభించింది. వారి ఫొటోలతోనే తొషిబా కంపెనీ సచిన్ ఛాయాచిత్రాన్ని రూపొందించింది. ‘సోషల్ మీడియాలో తొషిబా నిర్వహించిన ప్రచారానికి అద్భుతమైన స్పందన వచ్చింది. నా ముఖాన్ని రూపొందించేందుకు 17వేల మందికిపైగా అభిమానుల ఛాయాచిత్రాలను ఉపయోగించారు. ఈ ఛాయాచిత్రం హృదయాన్ని హత్తుకునేలా ఉంది. ఫొటోలో వెనకాల మువ్వన్నెల జెండా రంగులు ఉన్నాయి. ఇంతకు మించింది మరొకటి ఉండదు’ అని సచిన్ అన్నాడు.
0 comments:
Post a Comment