టాలీవ్ఞడ్ స్టార్ హీరోలు ఎప్పుడూ బాక్సాఫీస్ దగ్గర రికార్డుల విషయంలో పోటీపడుతుంటారన్న విషయం తెలిసిందే. అయితే గత కొంతకాలంగా మన స్టార్ హీరోల్లో మార్పు వస్తోంది. ఒకరంటే ఒకరు పోటీపడకుండా ఒకరి సినిమా హిట్ కోసం మరొకరు సహకారాన్ని అందిస్తున్నారు. ఇటీవల ఎన్టీఆర్ నటించిన 'బాద్‌షా సినిమాకు మహేష్ వాయిస్ ఓవర్ అందిస్తే తాజాగా మహేష్ నటిస్తున్న 'ఆగడులో ఎన్టీఆర్ గెస్ట్ అప్పియ రెన్స్ ఇవ్వడానికి గ్రీన్ సిగ్నలిచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నా యి. శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో మహేష్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో ఓ కీలకమైన అతిథి పాత్ర ఉందట. ఆ హైఓల్టేజీ పాత్రని ఎన్టీఆర్‌లాంటి హీరో చేత చేయిస్తేనే బాగుంటుందని దర్శకుడు శ్రీనువైట్ల భావించి ఆ విషయాన్ని ఇటీవల మహేష్‌కు వివరించాడట. శ్రీనువైట్ల చెప్పిన క్యారెక్టర్ కథలో కీలకం కావడంతో ఎన్టీఆర్ చేత చేయిస్తేనే బాగుంటుం దని మహేష్‌బాబు కూడా అంగీకరించాడట. ఈవిషయాన్ని శ్రీనువైట్ల తాజాగా ఎన్టీఆర్‌కు చెప్పినట్టు, పాత్ర నచ్చడంతో అతను చేయడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు చిత్రవర్గాల సమా చారం. ఇది అనుకున్నట్టుగా కార్యరూపం దాల్చితే ఇద్దరి అభిమానులకూ 'ఆగడు సినిమా పెద్ద పండగే అని చెప్పొ చ్చు. శ్రీనువైట్ల ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను సూపర్‌స్టార్ కృష్ణ పుట్టిన రోజున విడుదల చేయా లని ప్లాన్ చేస్తున్నారు.
|
0 comments:
Post a Comment