సినిమా రంగంలో హిట్టే అందరికీ ముఖ్యం. అయితే సినిమా హిట్ అయితే ఒక బాధ..కాకపోతే మరో బాధ. ప్రస్తుతం దర్శకుడు శ్రీనువైట్లది ఓ అనుకోని పరిస్థితి. 'దూకుడువంటి భారీ బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత ఆయన మరోసారి అదే నిర్మాతలతో మహేష్‌తోనే చేస్తున్న 'ఆగడు చిత్రంపై రోజురోజుకూ అంచనాలు పెరిగిపోతున్నాయి. మరి 'దూకుడు తర్వాత 'ఆగడు ఆ సినిమాని మించుతుం దా? అనే విషయం అందరిలో ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఒకవిధంగా 'ఆగడు చిత్రం శ్రీనువైట్లకు సవాల్ విసురు తోందనే చెప్పాలి. 'దూకుడుతో మహేష్‌ను సూపర్‌స్టార్‌ను చేసిన శ్రీనువైట్ల 'ఆగడుతో మహేష్‌ను నెంబర్‌వన్ స్థానా నికి తీసుకొనివెళ్తాడా, లేదా అన్న దానిపైనే అందరిలో చర్చ జరుగుతోంది. ప్రేక్షకుల అంచనాలను అందుకునే విధంగా మహేష్ కొత్త చిత్రం ఉంటుందట. మహేష్‌బాబు లోని కామెడీ అండ్‌ఎంటర్‌టైన్‌మెట్ యాంగిల్‌ను, కామెడీ టైమింగ్‌ను, డైలాగ్ డెలివరీని సరికొత్త కోణంలో ఆవిష్క రించిన చిత్రంగా 'దూకుడు పేరు తెచ్చుకుంది. మరి 'ఆగడు చిత్రంలో మహేష్‌ను అంతకంటే విభిన్నంగా ప్రజెంట్ చేయగలిగినప్పుడే ఈ సినిమా అభిమానులు, ప్రేక్షకులను అలరించి సూపర్‌డూపర్ హిట్‌గా నిలవగలదు.
|
0 comments:
Post a Comment