రెండు నెలల క్రితం ఈ సినిమా షూటింగ్‌లో నయనతారకు ఊహించని పరిణామం ఎదురైంది. శింబు, నయనతారలపై దర్శకుడు పాండిరాజ్ రొమాంటిక్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. షాట్ గ్యాప్‌లో కెమెరామేన్ బాలసుబ్రమణియన్, నయనను దగ్గరకు పిలిచి.. ‘‘నువ్వు శరీరంపై కాస్తంత శ్రద్ధ పెట్టాలి. కొన్ని కోణాల్లో చూస్తుంటే... శింబు కంటే పెద్దదానిలా కనిపిస్తున్నావ్. కెమెరాలో ఆ తేడా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. జాగ్రత్త’’ అని హెచ్చరించారట. అంతే.. నయనకు గుండె ఆగినంత పనైందట. ఆ రోజంతా అన్యమనస్కంగానే పనిచేశారట. ఇక బరువు తగ్గడమే తక్షణ కర్తవ్యం అనుకొని విపరీతంగా వర్కవుట్లు చేస్తూ, డైట్ ఫాలో అవుతూ నెల రోజుల్లో యుద్ధ ప్రాతిపదికన అయిదు కేజీలు తగ్గారట నయన. అయితే.. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ చందాన.. బరువు తగ్గడంతో ముఖంలో కళ కోల్పోయారట నయన. మళ్లీ కామెంట్లు మొదలు.
ఈ గండం నుంచి బయటపడటం ఎలా? అని ఆలోచిస్తుంటే, ఆయుర్వేదాన్ని ఆశ్రయిస్తే ఫలితం ఉంటుందన్న మిత్రురాలి సలహా మేరకు ఆయుర్వేదానికి సంబంధించిన క్రీముల్ని వాడటం మొదలుపెట్టారామె. డేట్స్ కోసం వచ్చే దర్శక, నిర్మాతలకు ఈ క్రీములు పూసుకొనే ఇంట్లో దర్శనమిస్తున్నారట నయన. అంతేకాదు.. ప్రస్తుతం నయనతార చాలా అందంగా, క్యూట్‌గా తయారయ్యారనేది కోలీవుడ్ టాక్.
0 comments:
Post a Comment