తెలుగు సినిమా తారలు చాలామంది ఈ ఎన్నికల సంగ్రామంలో దిగబోతున్నారు. రాజకీయ ప్రచారంలో తమకు నచ్చిన పార్టీలకు తమవంతు సహకారాన్ని అందించబోతున్నారు. తెలుగుదేశం, కాంగ్రెస్, బీజేపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వంటి పార్టీలకు పలువురు సినీ తారలు ఇప్పటికే తమ మద్దతును ప్రకటించారు. చిరంజీవి, పవన్ కల్యాణ్, బాలకృష్ణ, ఎన్టీఆర్, నాగార్జున, శివాజీ, ఆలి, ఇలా వెండి తెర దిగ్గజాలంతా రాజకీయ పార్టీలకు మద్దతు ప్రకటించడమే కాకుండా, ఎనికల్లో ప్రచారం కూడా చేయబోతున్నారు.
తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నటి సమంత రూత్ ప్రభు ఎన్నికల ప్రచారం చేయబోతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. సీమాంధ్రలోని బాపట్ల నియోజకవర్గంలో సమంత ప్రచారం చేయవచ్చని తెలుస్తోంది. సమంత ముఖ్య స్నేహితిరాలైన కోన నీరజ తండ్రి కోన రఘుపతి బాపట్ల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దిగుతున్నారు. తన స్నేహితురాలి తండ్రి కోసం సమంత ఎన్నికల ప్రచారం చేస్తారని సమాచారం!
0 comments:
Post a Comment