కానో: నైజీరియాలో ఉగ్రవాదులు మారణకాండ సృష్టించారు.ఈశాన్య నైజీరియా బోర్నో
రాష్ట్రంలో క్రై స్తవులు అధికంగా ఉండే ఇఘే గ్రామంపై దాడిచేసి దాదాపు వంద
మందిని ఊచకోత కోశారు. శనివారం రాత్రి ఆరు ట్రక్కులు, ద్విచక్ర వాహనాలపై
ఆయుధాలతో సైనిక దుస్తుల్లో వచ్చిన దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని
బార్నాబాస్ అనే రైతు వెల్లడించారు. ఈ ఘటనతో భీతిల్లిన చాలామంది గ్రామస్తులు
ఇళ్లను వదలి పారిపోయారు.
ఆ దుండగులు బోకో హరామ్ ఇస్లామిస్ట్ బోకో హరామ్‌కు చెందినవారుగా అనుమానిస్తున్నట్లు స్థానిక సెనేటర్ అలీ డుమె ఏఎఫ్‌పీ వార్తాసంస్థకు వెల్లడించారు. 60 మంది మతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించామని, మిగతావాటికి చేయాల్సి ఉందని చెప్పారు.

0 comments:
Post a Comment