నాయుడుపేటటౌన్, న్యూస్‌లైన్: అన్ని సర్వేల్లోనూ వైఎస్సార్‌సీపీ విజయ ప్ర స్థానం స్పష్టంగా కనిపిస్తోందని ఆ పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. ఎన్ని గిమ్మిక్కులు చేసిన నా ప్రజల్లో గుండెల్లో నుంచి వైఎస్సార్ ముద్రను చెరపలేరన్నారు. గురువారం నాయుడుపేటలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఎంపీ మాట్లాడుతూ పలు సర్వేల్లో వైఎస్సార్‌సీపీ 135-145 స్థానాల్లో విజయం సాధిస్తుందని వెల్లడైందన్నారు. టీడీపీకి 35- 40 స్థానాలు దక్కుతాయని సర్వేల్లో తే లిందన్నారు. కొంతమంది కాంగ్రెస్ నా యకులు టీడీపీ పంచన చేరుతుండటం తో చంద్రబాబు ఆనందపడుతున్నారని, అయితే ప్రజల్లో వైఎస్సార్‌సీపీకి ఏమాత్రం ఆదరణ తగ్గలేదన్నారు.
25 ఎంపీ స్థానాల్లో 22 వైఎస్సార్ సీపీకి దక్కే అవకాశం ఉందని పలు సర్వేలు తేల్చి చెప్పాయన్నారు. రాబోయే రోజు ల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోనే కాకుండా కేంద్రంలో కూడా పెద్ద భాగస్వామ్య పార్టీ కాబోతుందన్నారు. అన్ని విధాలుగా అభివృద్ధికి బాటలు వేసేం దుకు కృషి చేస్తున్న జగన్‌బాబును ఆదరించి స్థానిక, మున్సిపల్ ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికల్లోనూ ఫ్యాను గుర్తుకు ఓటు వేసి పార్టీ అభ్యర్థులకు విజయం చేకూర్చాలని కోరారు. ఎంపీ వెంట వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్, తిరుపతి పార్లమెం టు నియోజకవర్గ సమన్వయకర్త వరప్రసాద్, నియోజకవర్గ సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య, మండల కన్వీనర్ తంబిరెడ్డి సుబ్రహ్మణ్యంరెడ్డి, నాయకు లు కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి, కట్టా సుధాకర్‌రెడ్డి, ఆ పార్టీ రాష్ట్ర యువజన విభాగ కార్యవర్గ సభ్యులు ఓడూరు గిరిధర్‌రెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు పేరం మధునాయుడు, 786 సేవా సంఘ చైర్మన్ షేక్ రఫీ, కట్టా వెంకటరమణారెడ్డి ఉన్నారు.
మేకపాటి ప్రచార ర్యాలీకి అపూర్వ స్పందన
నాయుడుపేటలో మేకపాటి ప్రచార ర్యాలీకి అపూర్వ స్పందన లభించింది. ముందుగా మేకపాటి పాతబస్టాండ్ వద్దనున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్, వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి ప్రచార ర్యాలీ నిర్వహించారు. దారిపొడవునా వ్యాపారులు, గృహణిలను ఆప్యాయంగా పలకరిస్తూ ముం దుకు సాగారు. టీడీపీకి చెందిన స్థానిక ఫ్రెండ్స్ హోమ్ నీడ్స్ అధినేత చంద్రశేఖర్, స్థానిక నాయకులు కిలివేటి సంజీవయ్య, షేక్ రఫీ ఆధ్వర్యంలో మేకపాటి సమక్షంలో పార్టీలో చేరారు. జామియా మసీదు కూడలి వద్ద మసీదు ముతవళ్లీతో పాటు పలువురు మతపెద్దలను కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు దారి పొడవునా బాణాసంచా కాల్చుతూ పూలవర్షం కురిపిస్తూ మేకపాటికి ఘనస్వాగతం పలికారు.
0 comments:
Post a Comment