శ్రుతిహాసన్ ఐరన్ లెగ్ అనేది ఒకప్పటి మాట. ‘గబ్బర్‌సింగ్’తో శ్రుతి ఫేట్ మొత్తం మారిపోయింది. టైమ్ కలిసొస్తే అన్నీ కుదురుతాయేమో. వరుసగా విజయవంతమైన చిత్రాల్లో నటించడంతో పాటు శ్రుతిహాసన్ భారీ అవకాశాలు చేజిక్కించుకుంటున్నారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో వేరే కథానాయికలకు వెళ్లాల్సిన అవకాశాలు శ్రుతి ఖాతాలో చేరడం విశేషం. ఉదాహరణకు హిందీ చిత్రాలు ‘వెల్‌కమ్ బ్యాక్’, ‘గబ్బర్’. జాన్ అబ్రహాం హీరోగా అనీస్ బజ్మీ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘వెల్‌కమ్ బ్యాక్’. ఈ చిత్రంలో సోనాక్షీ సిన్హాని నాయికగా అనుకున్నారు కుదర్లేదు. ఆ తర్వాత అసిన్‌ని అనుకున్నారు. సెట్ కాలేదు. శ్రద్ధాకపూర్‌ని ఎంపిక చేయాలనుకుంటే, తను కూడా సెట్‌కాలేదు.
అటు తిరిగి ఇటు తిరిగి చివరికి శ్రుతిహాసన్‌కి ఈ అవకాశం వచ్చింది. ‘వెలకమ్’లాంటి విజయవంతమైన చిత్రానికి సీక్వెల్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇక, మరో చిత్రం ‘గబ్బర్’ విషయానికొస్తే... క్రిష్ దర్శకత్వంలో సంజయ్ లీలా భన్సాలీ నిర్మిస్తున్న చిత్రం ఇది. సూపర్ హిట్ మూవీ ‘రమణ’కి రీమేక్ ఇది. ఇదే చిత్రం తెలుగులో ‘ఠాగూర్’గా రీమేక్ అయ్యింది. హిందీలో అక్షయ్‌కుమార్ హీరోగా నటిస్తున్నారు. ముందుగా శ్రద్ధాకపూర్‌ని నాయికగా అనుకుంటే, కుదర్లేదట. దాంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో నటించే అవకాశం శ్రుతికి వచ్చింది. దాంతో ఈ ముద్దుగుమ్మను ‘లక్కీ లేడీ’ అంటున్నారు.
0 comments:
Post a Comment