జనసేన నేత, సినీ స్టార్ పవన్ కళ్యాణ్ పై సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల సైటైర్లు వేశారు. మోడీని గెలిపించాలనే పవన్ కళ్యాణ్ వ్యవహార తీరుపై సోషల్ మీడియా వెబ్ సైట్ ఫేస్ బుక్ లో ఆయన స్పందించారు.
పవన్ కళ్యాణ్ పై ఆయన ఏమన్నారంటే.. నిరాశ చెందాను. తికమక పడ్డాను. ఆ ఆవేశం ఎటు పోయింది. ఒక అన్యాయాన్ని ఎదుర్కొవడానికి మరో అరాచకాన్ని అరువు తెచ్చుకోవడం పోరాటం అనిపించుకోదు అని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. దీనికి సేన తో పని లేదు. ఒక వ్యక్తిని గెలిపించండి అని చెప్పడానికి ఇంత ఆవేశం అక్కర్లేదు. ఈ ఆవేశం పొరాటలకు దాచుకుందాం అని శేఖర్ కమ్ముల ఫేస్ బుక్ లో పేర్కొన్నారు.
కులం, మతం, ప్రాంతం పేరున విద్వేషాలు రేపి ఎన్నికల్లో గెలువాలని చూసే ఏ వ్యక్తికి గాని, పార్టీకి గాని మనల్ని పరిపాలించే అర్హత లేదు అని శేఖర్ కమ్ముల తన పోస్ట్ లో తెలిపారు. విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ నిర్వహించిన జనసేన సభలో కాంగ్రెస్ ను ఓడించాలని, కాబోయే
ప్రధాని మోడీ అంటూ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
0 comments:
Post a Comment