బెడ్ రూం సీన్ అయినా, అర్ధనగ్న సన్నివేశమైనా అభ్యంతరం చెప్పకుండా ఒప్పుకుంటున్న సన్నీలియోన్ తదితరులు మిగతా భాషా చిత్రాల్లోను, దక్షిణాది చిత్రాల్లోను నటించేందుకు సిద్ధమవుతున్నారు. వీరి రాకతో తమ అవకాశాలు చేయిజారిపోకుండా ఉండేందుకు ఏ మేరకు దుస్తుల్లో పొదుపు పాటించాలో, బెడ్ రూం సన్నివేశాల్లో ఎలా జీవించాలో క్షుణ్ణంగా నేర్చుకుంటున్నారు. లిప్‌లాక్ సన్నివేశాలు సర్వసాధారణంగా మారాయి. కుటుంబ కథా చిత్రాల కథానాయకిగా ముద్రపడిన గుంకీ (గజరాజు) హీరోయిన్ లక్ష్మీమీనన్‌కు తన ఐదవ చిత్రంలోనే లిప్ టు లిప్ ముద్దు సన్నివేశంలో నటించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అలాగే ఁనాన్ సిగప్పు మనిదన్* చిత్రం కోసం ఇటీవల లిప్ టు లిప్ సీన్ చిత్రీకరించారు. రేసు గుర్రర చిత్రంలో శ్రుతిహాసన్ బెడ్‌రూం సీన్‌లో అసభ్యంగా నటించినట్లు మహిళా సంఘాలు నిరసనలు తెలిపాయి. ఁచంద్రా* చిత్రంలో నటి శ్రీయ జాకెట్ ధరించకుండా నటించారు. టాప్‌లెస్ నటీమణుల సినీ ప్రవేశం, సెక్స్ చిత్రాలను ప్రోత్సహించే విధంగా ఉందని, అయినప్పటికీ ఈ ట్రెండ్ కొనసాగే అవకాశం లేదని చిత్రవర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.
0 comments:
Post a Comment