హీరోయిన్లు బయట అడుగు పెడితే....... అభిమానుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. ఇక ఆ హీరోయిన్లే రాజకీయాల్లోకి వచ్చి ప్రచార రంగంలోకి దూకితే జనాభిమానికి హద్దే ఉండదు. అయితే ఒక్కోసారి ఈ అభిమానం వెర్రితలలు వేస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ప్రముఖ సినీ నటి నగ్మా విషయంలో అదే జరిగింది. ఇటీవలి కాంగ్రెస్‌లో చేరి ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్న నగ్మాకు వరుసగా చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి.
నామినేషన్ సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అనుచిత ప్రవర్తనను మరిచిపోకముందే నగ్మాకు మరో చేదు అనుభవం ఎదురైంది. మీరట్‌లో ప్రచారానికి వచ్చిన నగ్మా పట్ల కొందరు వ్యక్తులు అసభ్యకరంగా ప్రవర్తించారు. నగ్మా చుట్టూ చేరిన అల్లరిమూక ఆమెను అడ్డుకుంది. ముందుకు వెళ్లకుండా అడ్డుకుంటూ విపరీత చేష్టలకు పాల్పడింది.
ఈ చర్యలతో నివ్వెరపోయిన నగ్మా... అల్లరి మూకపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ ఆకతాయి యువకుడు అసభ్యకరంగా ప్రవర్తించబోగా ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన ఆమె తన చేతికి పనిచెప్పింది. అందరి ముందే నగ్మా అతగాడి చెంప చెళ్లుమనిపించింది. ఈ సంఘటనతో అందరూ ఒక్కసారిగా నివ్వెరబోయారు. స్థానిక పెద్దల జోక్యంతో అక్కడి నుంచి బయటపడిన నగ్మా... అనంతరం ప్రచారం సాగించింది.
0 comments:
Post a Comment