ఒక మధ్యతరగతి కుటుంబం, ఓ మేక చుట్టూ తిరిగే కథతో జానకి విశ్వనాథన్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రమేష్ ఎస్. అరుణాచలం నిర్మించారు. త్వరలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకకి షారుక్ ఖాన్ పేరు పెట్టడంవల్ల ఆయనేమైనా ఫీలవుతారేమోనని దర్శక, నిర్మాతలు సందేహించారు. టైమ్ బాగాలేక షారుక్ అడ్డం తిరిగి, సినిమా విడుదలను అడ్డుకుంటారేమోనని భావించారు. దాంతో షారుక్ ఖాన్ మేనేజర్, ఆయన ఇతర బృందానికి ఈ సినిమా చూపించాలని నిర్ణయించుకున్నారు. షారుక్ గౌరవానికి భంగం కలిగేలా ఏదైనా సీన్ ఉందని ఆ బృందం భావిస్తే, మార్చేస్తారట. ఏదేమైనా ఆ మేక మాత్రం సెలబ్రిటీ అయ్యిందని చెప్పొచ్చు..
0 comments:
Post a Comment