హైదరాబాద్,మార్చి24: పాత కాలంలో హీరోయిన్లు ముఖ్యంగా సావిత్రి,వాణిశ్రీలు ఒక్కో సినిమాలో ఒక్కో తరహా చీరలు కట్టేవారు.అంతే కాదు హెయిర్ స్టయిల్ కూడా ఒక్కో సినిమాకు ఒక్కో విధంగా మార్చేవారు. వారి స్టయిల్, వారు ధరించిన దుస్తులను జనం అనుకరించేవారు. అప్పట్లో వాణిశ్రీ కొప్పు అని వాణిశ్రీ చీరలు అని వాణిశ్రీ గాజులు అని అమ్మేవారు. దాని తరువాత ఫలానా తాక ఈ సోపు వాడింది అని సోప్ కు మరింత ముందుకు వెళ్ళి నేడు ఆ ట్రెండ్ ఎన్ని దారులో తొక్కిందో తెలుసు. ఆ కాలంలో కూడా యన్.టి.ఆర్ బెల్ బాటం అని యన్.టి.ఆర్ పెద్ద కాలర్ అని అక్కినేని నాగేశ్వరరావు విగ్గు శోభన్ బాబు రింగు దాని తరువాత చిరంజీవి క్రాఫ్ అలా ఒక్కో తరం వారు ఒక్కో విధంగా ఫాసన్ ను అనుకరించేవారు. ఈ తరం వారు మరింత ముందుకు వెళ్ళి సినిమాల్లో తమ అభిమాన తారలు వాడే కార్లు,బైకులను పోలిన వాటిని వాడుతున్నారు. తాజాగా లెజెండ్ సినిమాలో బాలయ్య వాడిన బైకు పై దర్శకుడు బోయపాటి,సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ లు కూర్చున్నారిలా...చూసి మీరు ఆనందంచండి.
0 comments:
Post a Comment