టాలీవ్ఞడ్‌లో తనదైన ముద్రవేసి 'జులాయి తర్వాత పూర్తిగా బాలీ వ్ఞడ్‌పైనే దృష్టిపెట్టిన గోవా సుందరి ఇలియానా అక్కడ వరుసగా మంచి అవకాశాలను సంపాదిస్తోంది. తాజా గా టాప్ హీరో సల్మాన్‌ఖాన్ సర సన ఛాన్స్ సంపాదించేసింది. ఫ్యామిలీ డ్రామా మేళవించిన లవ్‌స్టోరీలు తీయడంలో పేరు పొందిన సూరజ్‌బర్జాత్యా డైరెక్ట్ చేయబోతున్న ఓ సినిమాలో సల్మాన్‌కు జోడీగా ఎంపికైంది ఇలి యానా. వాస్తవానికి ఈ పాత్రకు కరీనాకపూర్‌ను తీసుకోవాలని భావిం చాడు సూరజ్. కానీ చివరి నిమి షంలో ఆమెతప్పుకోవడంతో ఇప్పు డు ఆ క్యారెక్టర్ ఇలియానాను వరించింది. ఇప్పటికే బాలీవ్ఞడ్‌లో 'బర్ఫీ, 'ఫటాపోస్టర్ నిక్లా హీరో సినిమాలు చేసిన ఆమె ప్రస్తుతం రెండు, మూడు సినిమాల్లో నటి స్తోంది. హీరో సినిమాలు చేస్తోంది. ఎనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సూరజ్ బర్జాత్యా డైరెక్ట్ చేస్తున్న సినిమాలో హీరోయిన్‌గా నటించ నుండడం పట్ల ఆనందం వ్యక్తం చేసిన ఇలియానా ఆ సినిమాలో భాగం కావడాన్ని గౌరవంగా భావి స్తున్నానని తెలిపింది. సల్మాన్, సూరజ్ కాంబినేషన్‌లో ఇదివరకు వచ్చిన 'మైనే ప్యార్‌కియా, 'హమ్ ఆప్‌కే హై కౌన్, 'హమ్ సాథ్ సాథ్ హై సినిమాలు ఘన విజయాన్ని సాధించాయి. అందుకే ఆ కాంబినేష న్‌లో వస్తున్న తాజా సినిమా పట్ల అందరూ ఆసక్తిని కనబరుస్తున్నారు.
|
0 comments:
Post a Comment