హైదరాబాద్: మాజీ పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మా పార్టీ నాయకులతో టచ్‌లో ఉన్న మాట వాస్తవమేనని బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. కొన్నికారణాల వల్ల సినీ నటుడు మోహన్‌బాబు మా పార్టీలోకి రాకుండా ఆగిపోయారని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. టీడీపీతో పొత్తు ఉంటుందని మేమెప్పుడూ చెప్పలేదు అని అన్నారు.
ఇరుప్రాంతాల్లో మా బలమేంటో, టీడీపీ బలమేంటో ప్రజలకు తెలుసని ఆయన అన్నారు. ఉపఎన్నికల్లో మూడింట పోటీ చేసి రెండు స్థానాలు గెలిచామని, ఓ వైపు బీజేపీతో పొత్తు అంటూనే మమ్మల్ని విమర్శించడం చంద్రబాబుకు ఎంతవరకూ సమంజసమని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులే పార్టీని వీడుతున్నారని, టీడీపీ కార్యకర్తలే నాయకత్వంపై విశ్వాసం కోల్పోయారని ఆయన విమర్శించారు. తెలంగాణ బీజేపీగా అధిష్టానానికి మా అభిప్రాయం తెలియజేశామని, సీఎం అభ్యర్థిని కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తుందన్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
0 comments:
Post a Comment