భారత ప్రజాస్వామ్యపు పట్టుకొమ్మ మన పార్లమెంటు భవనం. ఈ పార్లమెంటు భవనంపై పట్టు కోసమే ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రపంచంలో ఏ దేశానికి లేనంత ప్రత్యేకమైన భవనం ఇది. అయితే ఈ పార్లమెంటు భవనం ఒక గుడికి మక్కికి మక్కి కాపీ అంటే నమ్మగలరా?
అవును. మన పార్లమెంటు భవనం మధ్యప్రదేశ్ లోని మోరేనా జిల్లాలోని మతౌలీ గ్రామంలో ఉన్న ఒక మందిరానికి నకలు. చౌసట్టి యోగిని మందిరంగా పేరొందిన ఆ గుడిని చూస్తే ముందు మనకు గుర్తొచ్చేది మన పార్లమెంటు భవనమే. మతౌలీ గ్వాలియర్ నుంచి 40 కి.మీ దూరంలో ఉంటుంది. ఢిల్లీ నుంచి కూడా పెద్ద దూరం కాదు. బ్రిటిషర్ల హయాంలో కోల్ కతా నుంచి ఢిల్లీకి రాజధానిని మార్చాలని నిర్ణయించినప్పుడు ఒక పార్లమెంటు భవనాన్ని కట్టాలని నిర్ణయించారు. అందుకు పలు రకాల మోడల్స్ వెతుకుతూంటే, ఆర్కిటెక్టులు ఎడ్వర్డ్ బేకర్, లుట్యున్స్ లు ఈ గుడిని చూశారు. ఇది వారికి ఎంతగా నచ్చిందంటే పార్లమెంటు భవనం ఇలాగే ఉండాలని నిర్ణయించారు. 1912 నాటికి మన పార్లమెంటు భవనం పూర్తయింది. చౌసట్టి యోగిని మందిర్ అంటే 64 మంది యోగినుల మందిరం అని అర్థం. దీన్ని ఏకాటేశ్వర మందిరం అని కూడా అంటారు. ఇందులో చుట్టూ 64 యోగినుల మందిరాలు, మధ్యలో శివలింగమూ ఉంటాయి. ఇది ప్రతీహార రాజులు కట్టించారు. ఇంతకీ పార్లమెంటు దేవుడి గుడిలా ఎందుకుంది? ప్రజలే దేవుళ్లు కాబట్టి ప్రజాస్వామ్యానికి ప్రాణం అయిన పార్లమెంటు దేవాలయం కావాల్సిందే మరి? ఏమంటారు? |
0 comments:
Post a Comment