ఈసారి తొలి ఎపిసోడ్ లో అత్యాచారాలు, రెండో ఎపిసోడ్ లో పోలీసు కానిస్టేబుళ్ల గురించి తీసుకున్నాడు. చివర్లో.. హ్యుమానిటీ ట్రస్టుకు విరాళాలవ్వాలని అమీర్ కోరుతాడని, అయితే.. ఆ డబ్బు ఓ వర్గ ప్రయోజనాలకే ఉపయోగపడుతుందని ఫేస్ బుక్ లో వ్యాఖ్యలు వచ్చాయి. అయితే అక్కడ చెప్పిన ట్రస్టుకు, తాను చెబుతున్న ట్రస్టుకు సంబంధం లేదని ఫేస్ బుక్ ద్వారానే అమీర్ స్పష్టం చేశాడు. వాట్స్ యాప్, ఫేస్ బుక్, ట్విటర్, ఇతర సోషల్ మీడియా ద్వారా ఇలాంటి సందేశాలు విపరీతంగా జనంలోకి వెళ్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఆరోపణలు పూర్తిగా తప్పని చెప్పాడు. తమ ట్రస్టు నిరుపేదలకు ఉచిత వైద్యసాయం అందించడంలో అద్భుతమైన సేవలు చేస్తోందన్నాడు.
0 comments:
Post a Comment