కాగా సాయంత్రం జరగబోయే సభలో పవన్ ఏం మాట్లాడాతారనేది రాజకీయ వర్గాల్లో చర్చ రేపుతోంది. ఇదే సభలో ఇజం పుస్తకాన్ని పవన్ ఆవిష్కరించనున్నారు. అయితే హైదరాబాద్ సభలాగా ఇక్కడ కూడా పవన్ వన్ మ్యాన్ షో ఉంటుందా లేక వేరే ఎవరికైనా మాట్లాడే అవకాశముందా ఇంకా తెలియలేదు.
కాగా గత కొద్దిరోజుల నుంచి సభా ఏర్పాట్లను పివిపి సంస్థ దగ్గరుండి పర్యవేక్షిస్తోంది. విశాఖ సభకు ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల నుంచి లక్షమంది వస్తారని నిర్వాహకులు ప్రకటిస్తున్నా .. స్టేడియానికి అంత సామర్థ్యం లేదు. ముఖ్యంగా యువతను లక్ష్యంగా చేసుకొని రెండు రోజుల పాటు నగరంలో ప్రచార ర్యాలీలు నిర్వహించిన పవన్ అభిమానులు వారందిరినీ సభకు తరలించేలా దృష్టి సారించారు.
0 comments:
Post a Comment