అయితే... చివరి నిమిషంలో మరో అయిదు టికెట్స్‌ని బుక్ చేయమని క్యాబ్ కంపెనీ వారిని హన్సిక రిక్వెస్ట్ చేశారట. ఆర్థిక భారం అధికమవుతుండటంతో ‘ఇక ఫ్లయిట్ టికెట్స్ తీయలేం’ అని క్యాబ్ కంపెనీవారు కరాఖండీగా చెప్పేశారట. మరి... ఈ పరిణామం హన్సికకు బాధ కలిగించిందో ఏమో.. అసలు ఓపెనింగ్‌కే ఎగనామం పెట్టేసింది. తమ కంపెనీ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హన్సిక రాబోతున్నారని ఓ రేంజ్‌లో పబ్లిసిటీ చేసుకున్న ఆ సంస్థ... హన్సిక హ్యాండివ్వడంతో ఒక్కసారిగా షాక్‌కు లోనయ్యారు. పైగా ఆహ్వాన పత్రికల్లో కూడా హన్సిక పేరు వేయడంతో వారు అవమానంగా కూడా ఫీలయ్యారట.
‘బాధ్యత కలిగిన సెలబ్రిటీ చేయాల్సిన పని కాదిది’ అంటూ హన్సికపై విమర్శల బాణాలను సంధించింది సదరు కంపెనీ యాజమాన్యం. అయితే... ఈ విషయంపై హన్సిక వెర్షన్ వేరేలా ఉంది. ప్రారంభోత్సవానికి హాజరవుతాననడం నిజమేనని, అయితే... తన స్టిల్స్‌ని మాత్రం సదరు కంపెనీ వారు ప్రచారానికి ఉపయోగించుకోకూడదని ముందే షరతు విధించారని సమాచారం. కానీ, దాని తాలూకు ఒప్పంద పత్రాన్ని అందజేయలేదట. అది తనకు బాధ కలిగించడంతో ఈ ప్రారంభోత్సవంలో పాలుపంచుకోవడానికి ఇష్టపడలేదట. చివరి నిమిషంలో కాకుండా, ఈ విషయాన్ని ముందే తెలియ జేశారట హన్సిక. మరి.. వీరి వాదనల్లో ఏది నిజమో వాళ్లకే తెలియాలి.
0 comments:
Post a Comment