న్యూఢిల్లీ,
మార్చి 27: ఎన్నికల వేళ నరేంద్ర మోదీపై ఆత్మాహుతి దాడి జరిగే అవకాశం ఉందని
నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. మోదీ పోటీ చేస్తున్న వారణాసి, వడోదరలలో
దాడులు చేయడానికి ఉగ్రవాదులు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారని స్పష్టం
చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. వారణాసిలో విధ్వంసం సృష్టించాలనుకున్న
ఉగ్రవాదుల కుట్రను గురువారం ఉగ్రవాద వ్యతిరేక దళం భగ్నం చేసింది. ఆత్మాహుతి
దాడులకు సిద్ధమైన ఇద్దరు ఉగ్రవాదులను యూపీలోని గోరఖ్‌పూర్‌లో అరెస్టు
చేసింది. వీరిద్దరూ పాకిస్థాన్ జాతీయులని, అయోధ్య నుంచి గోరఖ్‌పూర్‌కు
వెళుతుండగా అదుపులోకి తీసుకున్నట్లు ఏటీఎస్ వర్గాలు వెల్లడించాయి. కాగా..
మోదీకి ఉగ్ర ముప్పు పొంచి ఉందని.. ఆయనకు పూర్తిస్థాయి భద్రత కల్పించాలని
బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ డిమాండ్ చేశారు.
టవర్లు పేల్చేసిన మావోయిస్టులు
బీహార్‌లోని గయ సభలో మోదీ పాల్గొనడానికి కొన్ని గంటల ముందు అదే జిల్లాలోని దుమారియా ఇమామ్‌గంజ్ ప్రాంతలో మావోయిస్టులు రెండు సెల్ టవర్లను పేల్చివేశారు. అనంతరం ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిస్తూ అక్కడ లేఖలు వదిలి వెళ్లారు. ఆ ప్రాంతంలో పేలని బాంబులను కూడా పోలీసులు గుర్తించారు. మరోవైపు మావోయిస్టు నేతల హత్యకు నిరసనగా గురువారం రాష్ట్రంలో 24 గంటల బంద్‌కు మావోలు పిలుపునిచ్చారు.

0 comments:
Post a Comment