బొబ్బిలి, న్యూస్‌లైన్: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, నిత్యం ప్రజల మధ్యన ఉంటున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య క్షుడు జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసే వరకూ ప్రతి ఒక్కరూ పని చేయాలని ఆ పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త ఆర్వీ సుజయ్‌కృష్ణ రంగారావు పిలుపునిచ్చారు.
తెర్లాం మండలంలోని పెరుమాళి గ్రామానికి చెందిన 30 కుటుంబాలు తెలుగుదేశం పార్టీని వీడి శుక్రవారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. కేతి సత్యనారాయణ ఆధ్వర్యంలో చేరిన వీరికి సుజయ్ కండువాలు వేసి ఆహ్వానించారు. గ్రామాల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలని సుజయ్ అన్నారు. ప్రజల కోసం ఆలోచించడం వల్లనే అమ్మ ఒడి, పింఛను పెంపు, డ్వాక్రా రుణాల రద్దు, జన సేనా కేంద్రాల వంటి పథకాలను జగన్‌మోహన్ రెడ్డి ప్రకటించారని అన్నారు.
ఫ్యాను గుర్తుకు ఓటు వేసి వైఎస్‌ఆర్ సీపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. పార్టీలో చేరిన వారిలో కె.రవిశంక ర్, కె.గణేష్, జరజాన గోవింద, పుల్లాజి, ఎల్లయ్యదాసు, వెలగాడ నాగభూషనమ్మ, పొడగ ముగదమ్మ, రేగాన కమలమ్మ, ఎజ్రగడ చిన్నమ బోనెల రాంబాబులు కుటుంబాలతో చేరారు. కార్యక్రమంలో మండల నాయకుడు నర్సుపల్లి వేంకటేశ్వరరావు,సర్పంచ్ వెంకటరావు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment