(హైదరాబాద్ - ఆంధ్రజ్యోతి)
'తూర్పు ఎటో.. తీర్పు అటు' అన్న నానుడిని దృష్టిలో పెట్టుకుని.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తూర్పు గోదావరి జిల్లా నుంచి అసెంబ్లీ బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారా!? ఈసారి పోటీకి దూరంగా ఉంటారని చెప్పిన జగన్ తల్లి విజయలక్ష్మి మళ్లీ పులివెందుల నుంచే బరిలోకి దిగనున్నారా!? పెరుగుతున్న టీడీపీ ప్రాభవానికి అడ్డుకట్ట వేసి.. మెజారిటీ సీట్లను సాధించడమే ధ్యేయంగా వైసీపీ నేతలు పావులు కదుపుతున్నారా!? ఈ ప్రశ్నలు అన్నిటికీ 'ఔను' అనే జవాబిస్తున్నాయి వైసీపీ వర్గాలు. ఇటీవల వైసీపీ గ్రాఫ్ పడిపోయి దానికి దీటుగా టీడీపీకి ప్రజాదరణ పెరుగుతుండడంతో జగన్ నియోజకవర్గం మార్పును కోరుకుంటున్నారని వివరిస్తున్నాయి. ముఖ్యంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో టీడీపీకి బాగా అనుకూలంగా ఉందని కొన్ని సర్వేల్లో తేలడంతో వైసీపీ వర్గాల్లో ఆందోళన మొదలైంది. దీంతో, జగన్ తన సొంత నియోజకవర్గమైన పులివెందుల నుంచి కాకుండా తూర్పు గోదావరి జిల్లా నుంచి ఎన్నికల బరిలోకి దిగాలని పార్టీ వర్గాలు ఆయనపై ఒత్తిడి తెస్తున్నాయి.

వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న పులివెందుల నుంచి ఎవరిని నిలబెట్టినా సునాయాసంగా గెలుస్తారని.. ఈసారి పార్టీకి కాస్త క్లిష్టంగా ఉన్నచోటు నుంచి పోటీ చేస్తే ఆయనతోపాటు మరికొంతమంది అభ్యర్థులను గెలిపించుకుని ఎక్కువ సీట్లు సాధించుకునే అవకాశం ఉంటుందని వైసీపీలోని కొందరు కీలక నేతలు జగన్‌కు సూచించినట్టు సమాచారం. వాస్తవానికి, పులివెందుల నుంచి ఈసారి తానే పోటీ చేస్తానని, తన తల్లి విజయలక్ష్మిని ఎన్నికలకు దూరంగా ఉంచుతామని జగన్ ముందుగానే ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ, పార్టీ వర్గాల వాదన మరోలా ఉంది. పార్టీ బలహీనంగా ఉన్న తూర్పు గోదావరి నుంచి ఎన్నికల బరిలోకి దిగాలని సలహా ఇవ్వడంతోపాటు ఆయనపై తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వైసీపీ కాస్త బలహీనంగా ఉండడం.. ఆ జిల్లాల్లో టీడీపీకే మెజారిటీ సీట్లు వస్తాయని కొన్ని సర్వేలు స్పష్టం చేయడాన్ని కీలక నేతలు పరిగణనలోకి తీసుకుంటున్నారు.
తూర్పు నుంచి జగన్ పోటీ చేస్తే ఆ ప్రభావం ఉభయ గోదావరి జిల్లాల్లో ఉంటుందని.. దాంతో, టీడీపీ మెజారిటీని తగ్గించడంతోపాటు పార్టీ మరిన్ని సీట్లు సాధించుకునే అవకాశం ఉంటుందని జగన్‌కు వారు సూచించినట్టు తెలిసింది. ఉభయ గోదావరి జిల్లాల్లో మొత్తం 36 అసెంబ్లీ, ఐదు పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. మూడు పార్లమెంటు, 19 అసెంబ్లీ స్థానాలతో అత్యధిక సీట్లున్న జిల్లాగా తూర్పు గోదావరికి పేరుంది. దీనికితోడు, 'తూర్పు ఎటో తీర్పు అటు' అన్న నానుడి ఉండనే ఉంది. ఈ నేపథ్యంలోనే, ఇక్కడి నుంచి పోటీ చేస్తే మెజారిటీ సీట్లను గెలుచుకోవడమే కాకుండా టీడీపీని కొంతలో కొంతైనా దెబ్బ తీయవచ్చని జగన్‌కు వారు సూచిస్తున్నారు. జగన్ సోదరి షర్మిల విశాఖ పార్లమెంటు నుంచి పోటీ చేస్తున్నందున మొత్తం మూడు జిల్లాల్లో వైసీపీ ఎక్కువ శాతం ఓట్లు సాధించుకునే వీలుంటుందని వివరించారు. పులివెందుల నుంచి మళ్లీ విజయలక్ష్మి పోటీ చేస్తే.. సీమాంధ్రలోని ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమల నుంచి ముగ్గురు ప్రాతినిధ్యం వహించినట్టు అవుతుందని అన్నట్లు తెలిసింది. దీంతో, జగన్ కూడా త న నిర్ణయాన్ని మార్చుకున్నారని పార్టీ వర్గాల సమాచారం. పులివెందుల నుంచి విజయలక్ష్మినే మళ్లీ పోటీలోకి దించి.. ఆయన తూర్పు గోదావరి జిల్లాలోని ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నిలబడాలని నిర్ణయించుకున్నారని ఆ వర్గాలు వివరిస్తున్నాయి.
2 comments:
TDP balam punjukuntundhi ani evaru chepparu?
supeeeer
Post a Comment