బాలీవుడ్ ఐటమ్ గర్ల్ రాఖీ సావంత్ లోకసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉవ్విల్లూరుతోంది. అవకాశం లభిస్తే బీజేపీ తరపున పోటీ చేస్తానని లేకపోతే స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధమవుతోంది. ఇంకా విశేషమేమిటంటే పచ్చి మిరపకాయ గుర్తుతో ఓ పార్టీనే ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది.
తన ఆలోచణల్ని ఆచరణలో పెట్టేందుకుగాను జైన మతానికి చెందిన సాధువు పులక్ సాగర్ ను రాఖీ సావంత్ సోమవారం కలిసి ఆశీస్సుల్ని పొందారు. నిన్న ఆగ్రాకు చేరుకున్న రాఖీ సావంత్.. సాధువుతో రహస్య సమావేశం జరిపినట్టు సమాచారం. లోకసభ ఎన్నికల్లో ముంబై వాయవ్య ముంబై స్థానం నుంచి గురుదాస్ కామత్ పై పోటి చేయాలని నిర్ణయం తీసుకుంది. ఒకటి రెండు రోజుల్లో కొత్త పార్టీని ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ప్రధాని పీఠంపై నరేంద్రమోడీని కూర్చుండ పెట్టేందుకు తాను కృషి చేస్తానని రాఖీ సావంత్ తెలిపారు. ఇకపై బాలీవుడ్ లో ఐటమ్ గర్ల్ పాత్రలకు స్వస్తి చెప్పనున్నట్టు.. మంచి పాత్రలు లభిస్తే నటిస్టానని సావంత్ తెలిపింది. |
0 comments:
Post a Comment