కేసీఆర్ కుటుంబ రాజకీయాలపై వస్తున్న విమర్శలను హరీష్ రావు తోసిపుపుచ్చారు. తాము ఉద్యమాలు చేసినప్పుడు ఎందుకు ఈ విషయం గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. ఉద్యమాల్లో తాను పలుమార్లు అరెస్టయ్యానని వెల్లడించారు. హైదరాబాద్ లో తాను అరెస్టవని పోలీస్ స్టేషన్ లేదన్నారు.
టీడీపీ లబ్ది చేయడానికే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టారని అరోపించారు. టీడీపీ ఏజెంట్ గా ముందుకు వచ్చారని చెప్పారు. జనసేన పార్టీని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. పవన్ కళ్యాణ్ పక్క రాష్ట్రానికి చెందిన వ్యక్తి అని హరీష్ రావు అన్నారు. చిరంజీవిని కూడా తెలంగాణ ప్రజలు పట్టించుకోలేదన్నారు.
0 comments:
Post a Comment