అనంతపురం: అభిమానులు ఎప్పుడు, ఎలా ప్రవర్తిస్తారో ఊహించడం కష్టం. అనంతపురంలో బాలకృష్ణ అభిమానులు వీరంగం సృష్టించారు. ఇటీవల విడుదలైన 'లెజెండ్' చిత్రం అనంతపురంలోని 'గుర్నాథ్ థియేటర్'లో ప్రదర్శిస్తున్నారు. థియేటర్ లోని సౌండ్ సిస్టమ్ లో సాంకేతికపరమైన తలెత్తడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పదే పదే విజ్క్షప్తి చేసినా థియేటర్ యాజమాన్యం సౌండ్ సిస్టమ్ ను బాగు చేయకపోవడంతో అభిమానులు సీట్లు విరగకొట్టి, స్క్రీన్ చించి గందరగోళం సృష్టించారు.. అభిమానుల గందరగోళంపై థియేటర్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఈ సంఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
0 comments:
Post a Comment