కృష్ణా: జిల్లాలోని మచిలీపట్నంలో ఓ ప్రేమోన్మాది దారుణానికి పాల్పడ్డాడు. తల్లీకూతుళ్లపై సుభానీ అనే వ్యక్తి యాసిడ్ తో దాడిచేశాడు. పెళ్లికి నిరాకరించడంతో ఆ యువకుడు తల్లికూతుళ్లపై యాసిడ్ పోసినట్టు తెలుస్తోంది. గతకొంత కాలంగా సుభానీ పెళ్లి పేరుతో వేధిస్తున్నట్టు బాధితురాలి తల్లి తెలిపింది. ఈ ఉన్మాది దాడిలో వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమించడంతో స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. బాధితుల వివరాలు ఇంకా తెలియరాలేదు.
0 comments:
Post a Comment