క్రికెట్ నేపథ్యంలో ఓ సినిమా తెరకెక్కించే సన్నాహాలు జరుగుతున్నాయి. 'లగాన్ తరహాలో ఓ దర్శకుడు కథని సిద్ధం చేశాడట. 'లగాన్ సినిమా మన దేశానికి స్వాతంత్య్రం రాకమునుపు సాగే కథయితే ఈ సినిమా మాత్రం ఇండియా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన తొలి రోజుల నాటి నేపథ్యంలో సాగుతుందట. సినిమాలో రవిశాస్త్రి, కపిల్‌దేవ్‌లాంటి పాత్రలు కూడా ఉంటాయట. ఎలాంటి అంచనాలు లేని ఓ జట్టు వరల్డ్‌కప్ ఎలా గెలుచుకుందనే ఓ అంశంతో ఇండియా టీమ్ తొలిసారి వరల్డ్‌కప్ చేజిక్కించుకున్న పరిస్థితులను ప్రతిబింబించేలా సినిమాని తెర కెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఇందులో కపిల్‌దేవ్ పాత్రలో వెంకటేష్ నటిస్తారని తెలిసింది. సిసిఎల్‌లో ఆడుతున్న ఆటగాళ్లంతా సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారని సమాచారం. స్వతహాగా క్రికెట్ అంటే వెంకటేష్‌కి ఎంతో ఇష్టం. అందుకే సినిమాలో కపిల్‌దేవ్‌లా నటించేందుకు ఇష్టపడుతున్నారట. కుర్రకారును అలరించేలా అన్ని కమర్షి యల్ అంశాలతో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారట. మాస్ మసా లా సీన్లతో యూత్‌ను ఎంటర్‌టైన్‌చేసే విధంగా సినిమా ఉంటుందని సమాచారం. విభిన్నమైన కథాంశంతో సమ్‌థింగ్ స్పెషల్‌గా ఈ సినిమాను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గురిం చి అధికారికంగా వివరాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయని తెలిసింది.
|
0 comments:
Post a Comment