నరేంద్ర మోడీని ముక్కలు ముక్కలుగా నరుకుతాం. ఉత్తరప్రదేశ్ కి ఆయన వస్తే చంపి పోగులు పెడతాం' ఇదీ ఉత్తరప్రదేశ్ లోని సహారన్ పూర్ లోకసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఇమ్రాన్ మసూద్ బెదిరింపు.
తన నియోజకవర్గంలోని ముస్లిం ఓటర్లను రెచ్చగొట్టేందుకు ఆయన ఒక సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. మాట అనేసి మసూద్ మరిచిపోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడీ వ్యాఖ్యలు యూపీలో దుమారం రేపుతున్నాయి. 'గుజరాత్ లో ముస్లిం జనాభా నాలుగు శాతమే. అదే యూపీలో ముస్లిం జనాభా 42 శాతం. ఉత్తరప్రదేశ్ కి మోడీ వస్తే ముక్కలు ముక్కలుగా చేసేస్తాం. ఖబడ్దార్' అని ఆయన వ్యాఖ్యానించారు.
మసూద్ మొదట్లో సమాజ్ వాదీ పార్టీ నేత. 2012 ఎన్నికలకు ముందు ఆయన కాంగ్రెస్ లో చేరి, అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. ఈ మధ్య మళ్లీ సమాజ్ వాదీ పార్టీలో చేరేందుకు ప్రయత్నించి, భంగపడ్డారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ అభ్యర్థి అయ్యారు.
మసూద్ వ్యాఖ్యలపై బిజెపి మండిపడింది. ఈసీకి ఫిర్యాదు చేసేందుకు కమలనాథులు సిద్ధమౌతున్నారు. అందుకే ఇప్పుడు మసూద్ మాట మార్చి, నేను ఆ ప్రసంగం చేయలేదని సంజాయిషీలు ఇస్తున్నారు.

0 comments:
Post a Comment