ముంబై, మార్చి 12 : ఐపీఎల్-7 షెడ్యూల్ ఎట్టకేలకు ఖరారైంది. ఏప్రిల్ 16 నుంచి మే 30 వరకు మూడు విడతలుగా ఐపీఎల్-7 మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఏప్రిల్ 16 నుంచి మే 30 వరకు దుబాయ్‌లో తొలి విడత మ్యాచ్‌లు, మే 1 నుంచి 12 వరకు భారత్ లేదా బంగ్లాదేశ్‌లలో మ్యాచ్‌లు జరుగనున్నాయి.
మే 13 నుంచి జూన్ 1 వరకు భారత్‌లో మూడో విడత మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఎన్నికల దృష్ట్యా ఐపీఎల్‌కు భద్రత కల్పించలేమని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే ప్రకటించిన నేపథ్యంలో సౌతాఫ్రికాలో టోర్నమెంటు నిర్వహించేందుకు బీసీసీఐ యత్నించింది. అయితే అది కూడా కుదరని పక్షంలో మ్యాచ్‌లను దుబాయ్‌లో నిర్వహించేందుకు బీసీసీఐ నిర్ణయించింది. కాగా మే 1 తర్వాత ఎన్నికలు ముగిసిన ప్రాంతాల్లో మ్యాచ్‌లకు అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని బీసీసీఐ కోరినట్లు తెలుస్తోంది.
0 comments:
Post a Comment