Contact

Text

Saturday, 29 March 2014

ఉత్తమ విలన్‌లో.. రజనీకాంత్

00:02 - By Unknown 0

చాలాకాలం తర్వాత సూపర్ స్టార్స్ రజనీకాంత్, కమల్ హసన్ కలిసి నటించనున్నట్టు చెన్నై సమాచారం. ప్రస్తుతం నటుడు రమేష్ అరవింద్ దర్శకత్వంలో కమల్ నటిస్తున్న "ఉత్తమ విలన్" సినిమాలో రజనీకాంత్ ఓ ముఖ్య అతిథి పాత్రలో నటిస్తారని, అందుకు రజనీ అనుమతి కూడా కమల్ పొందినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో ఇప్పటికే ఇద్దరు దిగ్దర్శకులు బాలచందర్, విశ్వనాథ్ ఇతర ముఖ్యపాత్రలో నటిస్తున్నట్టు ఖాయం అయింది. వీరికి రజనీ కూడా తోడైతే ఆ సినిమాకు భారీ క్రేజ్ లభిస్తుందని వార్తలు వస్తున్నాయ్. దర్శకుడు లింగు స్వామితో కలిసి కమల్ నిర్మిస్తూ, రచయిత గానూ పని చేస్తున్న ఈ సినిమాలో కమల్ ద్విపాత్రాభినయం వినోదాత్మకంగా ఉంటుందని, ఓ పాత్ర గెటప్ ఇప్పటికే విడుదలై హాలీవుడ్ సినిమాను కాపీ కొట్టినట్టు వివాదాస్పదం అయినట్టు సమాచారం. 

Tags:
About the Author

Follow me @Latest news
View all posts→

Get Updates

Subscribe to our e-mail newsletter to receive updates.

Share This Post

0 comments:

narrowsidebarads

Post your AD here 300x250 AD TOP

...

Blog Archive

© 2014 HOT NEWS. WP Theme-junkie converted by Bloggertheme9
Powered by Blogger.
back to top