హైదరాబాద్: లెజెండ్ చిత్రంలో బాలకృష్ణ ఉపయోగించిన హార్లే డేవిడ్సన్ బైక్ ను వేలానికి పెట్టనున్నారు. వేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని బస్వతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రికి వినియోగించనున్నారు. బైక్ వేలంలో వచ్చిన సొమ్ము పేదవారికి ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటామని చిత్ర నిర్వాహకులు వెల్లడించారు.
ఈ వేలాన్ని లెజెండ్ చిత్ర విడుదలకు ముందే నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ చిత్రంలో బాలకృష్ణ కోసం ఆరెంజ్ కలర్ హార్లే డేవిడ్సన్ బైక్ ను ప్రత్యేకంగా డిజైన్ చేయించిన సంగతి తెలిసిందే.
జగపతిబాబు, రాధిక ఆంప్టే, సోనాల్ చౌహన్ లు నటించిన లెజెండ్ చిత్రం మార్చి 28 తేది శుక్రవారం విడుదలకు సిద్దమవుతోంది. బాలకృష్ణకు 'సింహ' లాంటి సూపర్ హిట్ అందించిన బోయపాటి శ్రీను ఈ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరించారు.
0 comments:
Post a Comment