Contact

Text

Showing posts with label BOLLYWOOD. Show all posts
Showing posts with label BOLLYWOOD. Show all posts

Tuesday, 11 November 2014

ఆ రోజులు నాకెంతో నేర్పాయి!

జీవితంలో కష్టసుఖాలు, ఎగుడుదిగుళ్ళు సహజం. మరీ ముఖ్యంగా ప్రతి శుక్రవారం అదృష్టం మారిపోయే సినీ ప్రపంచంలో అవి మరీ ఎక్కువ. అపజయాలు ఎదురై, కెరీర్ బాగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహనంతో వేచిచూడాలే తప్ప, మానసికంగా కుంగిపోకూడదు. సరిగ్గా ఆ మాటే చెబుతున్నారు - ఇప్పుడు హిందీ చిత్ర సీమలో హాట్ లేడీగా పేరు తెచ్చుకున్న దీపికా పదుకొనే. ‘‘ఈ రంగంలో ఉన్నప్పుడు ఒక నటిగా ఇటు విజయాలు, అటు పరాజయాలు - రెండూ ఎదురవుతాయి.

కొన్నిసార్లు అంతా ‘ఆహా... ఓహో...’ అన్నట్లు ఉంటే, మరికొన్నిసార్లు ఎంత కష్టపడినా తగినంత ఫలితం దక్కదు. నాకూ ఈ రెండు దశలూ అనుభవంలోకి వచ్చాయి. దేవుడి దయ వల్ల ప్రస్తుతం సినీ రంగంలో నా జోరు కొనసాగుతోంది. అయితే, నా సినిమాలు బాగా ఆడని రోజుల నుంచి నేనెంతో నేర్చుకున్నా’’ అని దీపిక చెప్పారు. ‘‘ఏ పని చేసినా సరే, పూర్తి స్థాయిలో కృషి చేసి, ఆ తరువాత సహనంతో వేచి చూడాలి. అలా చేస్తుంటే, క్రమంగా సానుకూల ఫలితాలు కనిపిస్తాయి.

ముఖ్యంగా పరాజయాల్లో ఉన్నప్పుడు ఇదే కీలక సూత్రం’’అని ఈ అందాల భామ వివరించారు. షారుఖ్ ఖాన్ సరసన గత ఏడాది ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’లో, ఈ ఏడాది ‘హ్యాపీ న్యూ ఇయర్’లో అలరించిన దీపిక ఒకప్పుడు విమర్శలను ఎదుర్కొన్నవారే! మోడలింగ్ నుంచి సినీ రంగానికి వచ్చి, ‘ఓం శాంతి ఓం’ ద్వారా తెరంగేట్రం చేసిన ఈ వయ్యారిభామ అప్పట్లో చిత్రాల ఎంపిక మొదలు నాసిరకం డ్యాన్సింగ్ నైపుణ్యాలు, భావాలు సరిగ్గా పలికించలేకపోవడం లాంటి అనేక విషయాల్లో విమర్శలను ఎదుర్కొన్నారు. కానీ, క్రమంగా ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద ‘గోల్డెన్ లెగ్’ అభినేత్రిగా పేరు తెచ్చుకున్నారు. అపజయాలు ఎదురైనప్పుడు సహనంతో కృషి సాగించి, ఇప్పుడు వరుస విజయాల బాటలో ఉన్న దీపిక చెప్పిన సక్సెస్‌ఫుల్ సహన సూత్రం ఏ రంగంలోని వారికైనా వర్తిస్తుంది కదూ!
20:37 - By Unknown 0

Thursday, 19 June 2014

బాలీవుడ్ నటిని రెండు గంటలపాటు ...

న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి రిచా చద్దాను ఢిల్లీ విమానాశ్రయంలో భద్రతాధికారులు, ఆధికారులు నిలిపివేసి ప్రశ్నించారు. రిచా చద్దా బ్యాగ్ లో ఉన్న వస్తువుపై అనుమానం తలెత్తడంతో అధికారులు సోదా చేశారు. రిచా చద్దా చర్మ సౌందర్యానికి ఉపయోగించే వస్తువులలో ఓ పౌడర్ పై అధికారులకు అనుమానం కలిగింది.
 

చర్మ సౌందర్యాన్ని మెరుగు పరుచుకునేందుకు గత ఆరు నెలలుగా సాంప్రదాయ పద్దతిలో ఆయుర్వేద పౌడర్ ఉపయోగిస్తున్నట్టు రిచా చద్దా అధికారులకు వెల్లడించారు. ఆయుర్వేద పౌడర్ చెప్పినా అధికారులకు నమ్మకం కలగపోవడంతో తనను రెండు గంటలపాటు ప్రశ్నించారని రిచా చద్దా మీడియాకు వెల్లడించారు. 
 
ఆయుర్వేద వస్తువులపై నాకు నమ్మకం చాలా ఎక్కవ. ముంబైకి ఆయుర్వేద వస్తువులు తీసుకెళ్లడం అలవాటు. ఈసారి మాత్రమే సమస్యగా మారింది అని రిచా చద్దా అన్నారు. తన వెంట ఉన్న ఆయుర్వేద వస్తువులను ఓపెన్ చేసి భద్రతాధికారులు తనిఖీ చేయడం ఇష్టం లేదని.. వాటిని నిలువ చేయడం చాలా కష్టపనైనందున తాను తొలుత నిరాకరించానని.. రెండు గంటలపాటు అధికారులను ఒప్పించడానికి శ్రమించినా.. ఉపయోగం లేకపోవడంతో తప్పని పరిస్థితుల్లో తనిఖీలకు అంగీకరించానని రిచా చద్దా అన్నారు. 'గ్యాంగ్ ఆఫ్ వాస్సేపూర్', 'ఓయే లక్కి! లక్కి ఓయే' అనే చిత్రాల్లో రిచా చద్దా నటించింది. 
03:57 - By Unknown 0

Tuesday, 17 June 2014

అతనితో సంబంధాలు అంటగట్టడం బాధేసింది: తమన్నా

ముంబై: బాలీవుడ్ దర్శకుడు సాజిద్ ఖాన్ సంబంధాలను అంటగట్టడం చాలా బాధేసిందని సినీ నటి తమన్నా భాటియా అన్నారు. సాజిద్ నాకు సోదరుడిలాంటి వాడని తమన్నా తెలిపింది. దక్షిణాదిలో అగ్రతారగా వెలుగొందిన తమన్నా.. అజయ్ దేవగణ్ సరసన 'హిమ్మత్ వాలా' చిత్రంలో నటించింది. సాజిద్, తమన్నాల సంబందాలపై బాలీవుడ్ లో ప్రచారం జోరందుకుంది. 
 
సాజిద్ నా సోదరుడు. నేను రాఖీ కూడా కట్టాను. రూమర్లు చాలా వినిపిస్తున్నాయి. ఓ యాక్టర్ ను డైరెక్టర్ నమ్మితే.. సంబంధాలను అంటగడుతారా? అంటూ తమన్నా ఓ ఇంటర్వ్యూలో విచారం వ్యక్తం చేశారు. సైఫ్ ఆలీ ఖాన్, రితేష్ దేశ్ ముఖ్, రామ్ కపూర్, బిపాసా బసు, ఇషా గుప్తాలతో కలిసి 'హమ్ షకల్స్' చిత్రంలో నటించింది. 
 
తమన్నా పాత్రతో పోల్చితే తన పాత్రకు అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదనే ఆరోపణపై బిపాసా బసు ఈ చిత్రం ప్రచారానికి దూరంగా ఉండటంపై మరో రూమర్ కూడా మీడియాలో ప్రచారం జరుగుతోంది. బిపాసా ప్రచారంలో పాల్గొనకపోవడానికి కారణం తనకు తెలియదని తమన్నా వెల్లడించింది. హాస్య చిత్రాలను రూపొందించడంలో దిట్ట సాజిద్ పై పొగడ్తలని తమన్నా గుమ్మరించింది. 
09:59 - By Unknown 0

Sunday, 15 June 2014

మాజీ ప్రియుడిపై కేసు పెట్టిన ప్రీతి జింతా


ముంబాయి : బాలీవుట్ నటి, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఓనర్ ప్రీతి జింతా తన మాజీ ప్రియుడు, వ్యాపారవేత్త నెస్ వాడియాపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. మే 30న వాంఖేడ్ స్టేడియంలో  పంజాబ్-చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా తనతో నెస్ వాడియా అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. అంతే కాకుండా తనపై చేయి చేసుకున్నాడని ప్రీతి జింతా ఆరోపించింది.

ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడినట్లు ఆమె గురువారం రాత్రి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. కాగా  ప్రీతి ఫిర్యాదు మేరకు ముంబయి మెరైన్ డ్రైవ్ పోలీసులు నెస్ వాడియాపై పలు సెక్షన్ల (354, 504, 506,509 సెక్షన్లు) కింద కేసు నమోదు చేశారు. పోలీసులు  దర్యాప్తు చేపట్టారు. నెస్ వాడియా, ప్రీతి జింతాల మధ్య గతంలో ప్రేమ వ్యవహారం నడిచిన విషయం తెలిసిందే. 
 
ఇద్దరూ కలిసి గతంలో ఐపీఎల్ పంజాబ్ టీంకు ఓనర్లుగా ఉన్నారు. కొంత కాలం తర్వాత ఇద్దరూ విడిపోయారు. ఇప్పుడు ఒకరంటే ఒకరికి పడనంత శత్రుత్వం. చివరికి వీరిద్దరి వ్యవహారం పోలీస్ స్టేషన్ కి చేరటం విశేషం. మరోవైపు ప్రీతి ఫిర్యాదును నెస్ వాడియా తోసిపుచ్చారు. ఆ ఆరోపణల్లో వాస్తవం లేదని తెలిపారు
11:04 - By Unknown 0

Friday, 23 May 2014

కోట్లకూ లొంగని కంగన

సినిమాల్లో భారీ పారితోషికాలు... మరో వైపు  వాణిజ్య ప్రకటనల్లో నటించడం ద్వారా వచ్చే ఆదాయం, అడపాదడపా షోరూమ్‌ల ప్రారంభోత్సవాలు... ఇలా నాలుగు చేతులా తెగ సంపాదించేస్తుంటారు కథానాయికలు. లైమ్‌లైట్‌లో ఉన్న ప్రతి కథానాయికకూ ఇవి మామూలే. అయితే... బాలీవుడ్ కథానాయికలకు మరో రూపంలో కూడా ఆదాయం వస్తూ ఉంటుంది. అదే... ‘పెళ్లి వేడుకల్లో డాన్స్’. కోటీశ్వరుల ఇళ్లల్లో జరిగే వేడుకల్లో స్టార్ హీరోయిన్ల డాన్స్ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ఉత్తరాదిన సర్వసాధారణం. కరీనా, కత్రినా, దీపిక... ఇలా స్టార్ హీరోయిన్లందరూ ఇలా ప్రైవేటు వేడుకల్లో పదం కలిపిన వారే.
 

 ఇలా డాన్స్ చేయడం వల్ల సదరు కథానాయికలకు భారీ మొత్తంగా పారితోషికాలు అందుతూ ఉంటాయి. ఇటీవలే ఇలాంటి అవకాశమే ‘క్వీన్’ కంగనా రనౌత్ తలుపు తట్టింది. ఢిల్లీలో జరిగే ఓ పెళ్లి కార్యక్రమంలో డాన్స్ చేస్తే... మూడు కోట్ల రూపాయలు పారితోషికంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పినా... అంతటి ఆఫర్‌ని సున్నితంగా తిరస్కరించారట కంగనా. ‘క్వీన్’ తర్వాత కంగనా ఖ్యాతి దేశవ్యాప్తంగా పెరిగిపోయింది. దీంతో... ఈవెంట్స్‌లో, పెళ్లిళ్లలో కంగనాతో డాన్స్ చేయించాలని ఉత్తరాదిన చాలామంది పోటీ పడుతున్నారట. అయితే... కంగనా మాత్రం ‘నేను చేయను’ అని నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారని స్వయానా కంగనా సోదరి రంగోలి ఇటీవల ఓ సందర్భంలో తెలిపారు. ‘క్వీన్’కి ముందు కూడా కంగనాకు ఇలాంటి ఆఫర్లు వచ్చాయని, అయితే... ఆమె మాత్రం వేటికీ అంగీకారం తెలుపలేదని, కంగనా దృష్టి మొత్తం పాత్రలపైనే ఉంటుందని రంగోలి అన్నారు.
 
15:11 - By Unknown 0

మోస్ట్ డిజైరబుల్.. మహేష్ బాబు

హైదరాబాద్
 : నెంబర్ 1.. కేవలం సినిమా పేరు మాత్రమే కాదు, దేశవాసులు అత్యంత ఎక్కువగా కోరుకునే (మోస్ట్ డిజైరబుల్) జాబితాలో కూడా నెంబర్ 1 ఎవరో కాదు.. ప్రిన్స్ మహేష్ బాబు!! భారతదేశంలో మొత్తం 50 మంది పేర్లు చెప్పి.. వాళ్లలో ఎక్కువగా ఎవరిని కోరుకుంటారని టైమ్స్ ఆఫ్ ఇండియా సంస్థ పోల్ నిర్వహించగా, మొత్తం 7.34 లక్షల మంది ఓట్లు వేశారు. గత రెండేళ్లుగా టాప్ 5 స్థానాల్లో నిలుస్తూ వచ్చిన మహేష్ బాబు.. ఈసారి ఏకంగా అగ్రస్థానానికి చేరుకున్నాడు. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ రెండో స్థానం మాత్రమే పొందగలిగాడు. 2011లో ఐదో స్థానంలోను, 2012లో రెండో స్థానంలోను ఉన్న మహేష్.. ఈసారి నేరుగా అగ్రపీఠాన్ని అందుకున్నాడు. దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానుల్లో ఏడు లక్షల మంది ఓట్లు వేస్తే వాటిలో ఎక్కువగా మహేష్ కే వచ్చాయి. బాలీవుడ్ హీరోయిన్లు దీపికా పదుకొనే, సోనమ్ కపూర్ కూడా తాము ఎక్కువగా కోరుకునేది మహేష్ బాబునేనని, ఒక అవకాశం దొరికితే అతడితో కలిసి నటించాలనుకుంటున్నామని చెప్పారు!!


గతంలో శ్రీనువైట్లతో దూకుడు తీసి బ్రహ్మాండమైన హిట్ సాధించిన మహేష్ కు వాస్తవానికి 1.. నేనొక్కడినే సినిమా కలెక్షన్ల పరంగా కాస్త నిరాశనే మిగిల్చింది. అయితే, ఇప్పుడు మళ్లీ శ్రీనువైట్లతోనే 'ఆగడు' సినిమా తీస్తూ.. మళ్లీ పవర్ ఫుల్ పోలీసు అధికారి పాత్రతో మరో బంపర్ హిట్ సాధించేందుకు మహేష్ సిద్ధమవుతున్నాడు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే దేశవాసులు ఎక్కువగా కోరుకునే నటుడిగా నెంబర్ 1 స్థానం దక్కడం మహేష్ బాబుకు మంచి ఊపునిచ్చింది. తనకు ఓటేసిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా మహేష్ కృతజ్ఞతలు తెలిపాడు. ప్రతిసినిమాలోనూ కష్టపడి అభిమానులను సంతోషపెట్టాలన్నదే తన ఉద్దేశమని ఈ సందర్భంగా అన్నాడు. ఇలా నెంబర్ 1 స్థానం రావడం వెనక తన అభిమానుల అండదండలు ఉన్నాయని, వాళ్లవల్లే తాను ఇక్కడ ఉన్నానని చెప్పాడు.
03:00 - By Unknown 0

Thursday, 15 May 2014

Katrina kaif spotted with porn Movie Maker (अगर कैटरीना निकलीं पोर्न एक्ट्रेस तो! क्‍या टूट जाएगी सीक्रेट इंगेजमेंट)

यह बड़ा मुश्किल सवाल है क्योंकि कैटरीना के हर लिंकअप की इमारत धड़ाम से नीचे आ गिरेगी अगर ये न्यूज सच निकली तो, बहहाल ये तो सच है ही कि पोर्न फिल्मेमेकर से उनका रिलेशन बॉलिवुड में आने से पहले ही था. क्‍या जिस रिंग को बड़े स्‍टाइल से फ्लांट कर रही हैं वो कोशिश है उनके पोर्न एक्‍ट्रेस होने के सच को छुपाने की.

अगर कैटरीना निकलीं पोर्न एक्ट्रेस तो! क्‍या टूट जाएगी सीक्रेट इंगेजमेंट
जैसे ही कैटरीना कैफ की पोर्न फिल्ममेकर टेर्री स्फेन्स के साथ पिक्चर्स इंटरनेट पर वायरल हुई हैं और  सनसनी सी फैल गयी है. वैसे ही ये वीडियो भी आगया है जो उनकी सीक्रेट इंगेजमेंट की रयूमर फैला रहा है क्‍या ये पोर्न एक्‍ट्रेस होने के सच को छुपाने की कोशिश है. ये पिक्चर्स उनके बॉलिवुड में करियर स्टार्ट करने से पहले की हैं और यही सबसे बड़ा सवाल है कि क्या सनी लियोन नहीं कैटरीना कैफ फर्स्ट बॉलिवुड एक्ट्रेस हैं जिन्होंने पोर्न फिल्मों से बॉलिवुड का सफर किया.

कटरीना की सीक्रेट इंगेजमेंट: दिखाई अँगूठी- वीडियो देखें

सलमान खान के मजबूत सहारे को छोड़ कर कैटरीना कैफ ने रणबीर कपूर का हाथ थामा है जिनके साथ उनके रिलेशनशिप की नैया हमेशा डगमगाती रही है. ऐसी न्यूज आती रही है कि नीतू सिंह जो रणबीर की मां हैं कभी भी इस रिश्ते से खुश नहीं रहीं अब अगर कैट के बारे में आ रही ये रयूमर्स सच प्रूव हो गयीं तो उनका और रणबीर का रिलेशन खत्म होना तय है क्योंकि कपूर फेमिली इस बात को कभी एक्सेप्ट नहीं करेगा.
टेर्री स्फेन्स नाम के ये पोर्न फिल्मकमेकर ब्लू मूवी की सीडी सेल करते थे उसके बाद वे पोर्न मूवी प्रोडयूसर करने लगे और प्रोड्यूसर बन गए. इस तस्वीर में कैटरीना की बहन इसाबेल पोर्न मूवी मेकर के साथ जिस तरह पोज देते हुए दिख रही है वो भी अच्छा नहीं कहा जा सकता. इसाबेल इससे पहले भी लाइम लाइट में रही थीं जब उनकी तरह दिखने वाली एक लड़की का अननोन पर्सन के साथ सेक्स करते हुए एमएमएस इंटरनेट पर लीक हुआ था, लेकिन ये कंफर्म नहीं हो सका था कि वो लड़की खुद इसाबेल हैं या उनकी लुक अलाइक.

हॉट कटरीना कैफ बाथटब में - वीडियो देखें



जहां तक कैटरीना के बारे बात की जाए तो उन के बारे में सबको यही पता है कि बॉलीवुड में एंट्री करने से पहले वे लंदन में मॉडल थी. कैटरीना ने 'बूम' फिल्म से बॉलीवुड में एंट्री की थी जो बेहद बोल्ड सींस से भरपूर थी और बुरी तरह फ्लॉप रही थी. बाद में उन्हें सलमान खान का सर्पोट मिला और उनके करियर की गाड़ी चल निकली. लेकिन ये तय है कि कैट कभी अपने करियर में बोल्ड  और इंटिमेट सींस देने में अन कंफर्टेबल नहीं रहीं.  
11:41 - By Unknown 0

పూనమ్ పాండే ను అరెస్ట్ చేసిన పోలీసులు


ముంబయ్: బాలీవుడ్ నటి పూనమ్ పాండేను అసభ్యప్రవర్తన కేసులో పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్టుచేశారు. బహిరంగ ప్రదేశాల్లో అసభ్యంగా ప్రవర్తించిందన్న కారణంగా ఆమెను ముంబయ్ లోని మీరారోడ్డులో అదుపులోకి తీసుకున్నారు. టీమిండియా వరల్డ్ కప్ గెలిస్తే చాలు.. బట్టలిప్పేస్తానంటూ బహిరంగంగా ప్రకటనలు చేసి, బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన నటీమణి పూనం పాండే అతి తక్కువ కాలంలోనే మంచి పాపులారిటిని సంపాదించింది.  

అనంతరం ఇటవుంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకూడదని ఆమెను మందలించిన పోలీసులు సొంతపూచీకత్తుపై ఆమెను విడుదల చేశారు. చిట్టచివరిసారిగా పూనమ్ పాండే బాలీవుడ్ లో నటించిన సినిమా.. నషా. ఆ తర్వాత ఆమెకు సినిమా ఛాన్సులు కూడా ఏమీ రాలేదు. దాంతో ఇలా ఏదో ఒక పిచ్చిపని చేసి వార్తల్లో ఉండాలన్నదే ఆమె లక్ష్యంలా కనిపిస్తోంది.
06:21 - By Unknown 0

Tuesday, 13 May 2014

మరిన్ని చిక్కుల్లో సల్మాన్ ఖాన్

సాక్షి ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ‘హిట్ అండ్ రన్’ కేసు ఊబిలో మరింత కూరుకుపోయారు. ఈ కేసుకు సంబంధించి కోర్టులో మంగళవారం విచారణ సందర్భంగా ప్రత్యక్షసాక్షులు ఘటనాస్థలిలో ఆగిన కారు నుంచి సల్మాన్ దిగారని తెలిపారు. కాగా, 2002లో బాంద్రా క్వార్టర్ రోడ్డు ఫుట్ పాత్‌పై నిద్రిస్తున్న ఐదుగురిని సల్మాన్‌ఖాన్ కారు ఢీకొట్టింది. వేగంగా కారు నడపడంతోపాటు మద్యం సేవించి కారు నడిపినట్టు సల్మాన్‌పై ఆరోపణలున్నాయి.

ఇంతకుముందే ఈ ఘటనపై కేసులో విచారణ జరిగినా ఎటూ తేలకపోవడంతో న్యాయస్థానంలో  తాజాగా విచారణ ప్రారంభమైంది. మంగళవారం సల్మాన్ ఖాన్ స్వయంగా కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో సాక్షులైన ముస్లీం శేఖ్, మున్ను ఖాన్‌లు కూడా కోర్టుకు వచ్చారు. విచారణ సమయంలో వీరిద్దరు సల్మాన్‌ను గుర్తించడంతోపాటు ఆ సమయంలో తీవ్రంగా మద్యంసేవించి ఉన్నట్టు పేర్కొన్నారు. ప్రమాదం తర్వాత మద్యం మత్తులోనే కారునుంచి బయటికి దిగినట్టు కూడా చెప్పారు. దీంతో సల్మాన్‌ఖాన్ మరిన్ని చిక్కుల్లో పడే అవకాశం కనబడుతోంది.  

గతంలో ఈ ‘హిట్ అండ్ రన్’ సంఘటనకు సంబంధించి పలుమార్లు కోర్టుకు హాజరుకావలని పేర్కొంది. అయినప్పటికీ 80సార్లకుపైగా కోర్టుకు సల్మాన్ ఖాన్ హాజరుకాలేదు.  సామాన్యులకు ఓ న్యాయం, సల్మాన్ ఖాన్‌కు మరో న్యాయం ఇలా ఎందుకు చేస్తున్నారన్న ప్రశ్నను మాజీ ఐపీఎస్ అధికారి వైపీ సింగ్, ఆయన సతీమణీ తెరమీదికి తీసుకువచ్చారు. ఈ కేసు విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ముంబై పోలీసులపై ఆరోపణలు గుప్పించడంతోపాటు కేసు కూడా నమోదుచేశారు. దీంతోపాటు ఇతర అనేక కార ణాల వల్ల  కేసును మళ్లీ దర్యాప్తు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు తాజా దర్యాప్తులో సాక్షులు సల్మాన్‌ను గుర్తుపట్టడంతో ఇబ్బందులు అధికమయ్యాయని తెలుస్తోంది. ఒకవేళ హిట్ అండ్ రన్ కేసులో హత్యా నేరం రుజువైతే అతడికి పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశాలున్నాయి.
22:21 - By Unknown 0

నో బికినీ... ఓన్లీ... లిప్‌లాక్


ఇక్కడో మాట... అక్కడో మాట చెబుతూ యుక్తిగా కెరీర్‌ని నెట్టుకొస్తోంది అందాలభామ యామి గౌతమ్. ఇటీవల ఓ కోలీవుడ్ మీడియా ఇంటర్‌వ్యూలో కథ డిమాండ్ చేస్తే బికినీ వేస్తారా? అని అడిగితే -‘మోతాదు మించిన గ్లామర్‌ని నేను ఒప్పుకోను. అందంగా కనిపించడమే గ్లామర్, అలాగాక శృతి మించి వల్గారిటీ దాకా వెళ్లాల్సివస్తే సినిమానే వదులుకుంటా’ అని బల్లగుద్ది మరీ చెప్పింది యామి. ఇక్కడ్నుంచి బాలీవుడ్ సినిమా చేయడానికి ముంబయ్ వెళ్లింది.. అక్కడ ఓ ఇంటర్‌వ్యూలో పాల్గొంది.  గ్లామర్ గురించి మాట్లాడుతూ -‘కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి మరి. కథ డిమాండ్ చేస్తే లిప్‌లాక్‌కు కూడా నేను రెడీ’ అని స్టేట్‌మెంట్ ఇచ్చేసింది. దీన్ని బట్టి యామి... తన కెరీర్‌ని ఎంత లౌక్యంగా లాక్కొస్తుందో అర్థం చేసుకోవచ్చు.

కథానాయికలందరికీ అంతిమ లక్ష్యం బాలీవుడ్. అందులో భాగంగానే దక్షిణాదిన బెట్టుగా ఉంటూ, బాలీవుడ్‌లో మాత్రం రెచ్చిపోతుంటారు. యామీ సమాధానాలు అందులో భాగమే. ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుణ్‌ధావన్‌కు జోడీగా ఓ సినిమాలో నటిస్తోంది తను. శ్రీరామ్ రాఘవన్ దర్శకుడు. కథ రీత్యా ఆ చిత్రానికి లిప్‌లాక్ అవసరం. దాంతో దర్శకుడు లిప్‌లాక్ ప్రపోజల్ ఆమె ముందుంచాడు. అడిగిందే తడవుగా లిప్‌లాక్‌కి ఓకే చెప్పేసిందట. త్వరలోనే వరుణ్, యమీలపై ఈ సన్నివేశాన్ని తెరకెక్కించనున్నారు శ్రీరామ్ రాఘవన్.
 
22:18 - By Unknown 0

Monday, 12 May 2014

ఐష్ పెళ్లయింది.. నాకు పిచ్చెక్కింది!!



ముంబై : ఐశ్వర్యారాయ్ మళ్లీ వార్తల్లోకి వచ్చింది. పెళ్లి, ఆరాధ్య పుట్టడం, మళ్లీ గర్భవతి అంటూ కథనాలు రావడం.. ఇవన్నీ ఒక ఎత్తయితే ఇప్పుడు శ్రీలంక జాతీయుడు ఒకరు చేస్తున్న ఆరోపణలు మరో ఎత్తు. ఒకప్పుడు తాను, ఐశ్వర్యారాయ్ ప్రేమించుకున్నామని... అయితే ఆమె కాస్తా అభిషేక్ బచ్చన్ ను పెళ్లి చేసుకోవడంతో తనకు పిచ్చెక్కిందని శ్రీలంకకు చెందిన నిరోషన్ దేవప్రియ ఆరోపిస్తున్నాడు. అంతేకాదు, ఈ మేరకు ఓ ఫిర్యాదు కూడా దాఖలు చేశాడు.

తన కేసు వాదించడానికి ఒక న్యాయవాదిని కూడా పెట్టుకున్నట్లు సమాచారం. ఆ న్యాయవాదికి ఇవ్వాల్సిందిగా 17 లక్షల రూపాయలను తన మేనకోడలికి ఇవ్వగా, ఆమె ఆ డబ్బులు ఇవ్వకుండా ఎటో వెళ్లిపోయింది. దాంతో ఇప్పుడు నిరోషన్ అటు ఐశ్వర్య పెళ్లితో పాటు తన మేనకోడలి మోసంపై కూడా కోర్టులో కేసు దాఖలు చేశారు. వాయిదాల్లో ఆ డబ్బు మొత్తాన్ని నిరోషన్ కు చెల్లించాలని కోర్టు అతడి మేనకోడలిని ఆదేశించింది. ప్రస్తుతం చైనాలో ఉంటున్న అతడు.. ఐశ్వర్య తనకు పిచ్చెక్కించిందంటూ పెట్టిన కేసు మాత్రం ఇంకా పెండింగులో ఉంది. ఐశ్వర్యకు అభిషేక్ తో పెళ్లయ్యి ఇప్పటికి ఏడు సంవత్సరాలు గడిచిపోయి, వాళ్లిద్దరికీ ఓ బిడ్డ పుట్టి రెండేళ్లు అయిన తర్వాత ఇన్నాళ్లకు అతడికి కేసు విషయం గుర్తుకొచ్చింది.
07:24 - By Unknown 0

Sunday, 4 May 2014

Poonam Pandey arrested for indecent behaviour


MUMBAI: Poonam Pandey, who is known for posting raunchy photos and videos on social networking site Twitter, was arrested for allegedly behaving indecently in public.

According to a police officer involved with the case, Poonam Pandey was in skimpy clothes with a male friend in a car and indulged in inappropriate behaviour at Mumbai's Mira Road, reports The Indian Express.

She was arrested and released later after a warning, Mid-Day report says.

But Poonam had a different story to say and asked if listening to songs in a car amounted to indecent behaviour.

Poonam had first grabbed attention during the 2011 Cricket World Cup when she offered to go nude before Team India if they won.

Though she didn't keep up to her word, a nude photograph of her was posted on Twitter in 2012. However, she has clarified that it was morphed.

She has since been in the news by posting outrageous photographs of herself in various stages of undress on social media sites.

Poonam says her family has given up on her. "They know, 'yeh ladki sudhregi nahin'. You know what? I enjoy all the controversies. I love being in the news. I take everything positively."
03:07 - By Unknown 0

Tuesday, 29 April 2014

మోస్ట్‌ ఫిట్‌నెస్డ్‌ మ్యాన్‌ సల్మాన్‌ఖాన్‌



బాలీవుడ్‌  కండలవీరుల కాంపిటీన్‌లో సల్మాన్‌ మరోసారి మొదటిస్థానంలో నిలి చాడు. హృతిక్‌, రణవీర్‌, షాహిద్‌, అర్జున్‌ రాంపాల్‌ను వెనక్కినెట్టి తాను ఈ రేసులో  విజేతగా నిలిచాడు. హెల్త్‌ అండ వెల్‌నెస్‌ అనే సంస్థ బాలీవ్ఞడ్‌లో మోస్ట్‌ ఫిట్‌నెస్డ్‌ మ్యాన్‌ ఎవరంటూ ఓ సర్వే నిర్వహించిం ది. ఇందులో మొత్తం 30 వేల మంది పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తంచేశా రు. అయితే సల్మా న్‌కు 43.26 శాతం మంది ఓటేసి విజే తగా నిలిపారు. కొద్ది తేడాలో 42.81 శాతం ఓట్లతో హృతిక్‌ రెండో స్థానంలో నిలిచారు. ఈ కాంపిటీష న్‌లో మిగిలిన వారికి నామమాత్రమైన ఓట్లు మాత్రమే వచ్చాయి. కొత్తగా బాలీవ్ఞ డ్‌లోకి ఎంతో మంది సిక్స్‌ప్యాక్‌ కండల వీరులు వచ్చి నా సల్మాన్‌ మాత్రం తన నెం.1 స్థానం నిలబెట్టుకోవడం గమనార్హం. వయసుమీరుతున్నా సల్మాన్‌్‌ మాత్రం తన ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడం విశేషం.
23:55 - By Unknown 0

Saturday, 29 March 2014

AJAY DEVGN, SONAKSHI SINHA BAG WORST ACTOR GOLDEN KELA AWARDS

.
Ajay Devgn and Sonakshi Sinha have bagged the worst actor Golden Kela award for 'Himmatwala' and 'R...Rajkumar' respectively in the sixth edition of the annual event which celebrates the worst in Hindi Cinema.
This is the second win for both the actors in the same category - Sonakshi and Devgn had won the awards last year for 'Dabangg', 'Rowdy Rathore'and 'Son of Sardaar', 'Bol Bachchan' respectively.
Worst Director award was won by Sanjay Leela Bhansali for 'Ram Leela'. Filmmaker Sajid Khan's 'Himmatwala', the remake of 1983's hit action-drama of the same name, that tanked at the box office was named the worst film.
The reboot also bagged RGV Ki Aag Award for Most Pointless Remake/Sequel. 'Himmatwala', What would be more pointless than remaking a 30 year-old remake, Anant Singh, Creative Head, Golden Kela Awards, who was also hosting the show said about the movie.
The worst supporting actress award went on to Deepika Padukone, Jacqueline Fernandes and Amisha Patel for 'Race 2', while Aditya Roy Kapoor won the worst supporting actor title for 'Yeh Jawaani Hai Deewani'. Aamir Khan scored the Baawra Ho Gaya Hai Ke Award for his superhit film 'Dhoom 3'. Aamir Khan once said that he loves the Kela Awards, because all other awards are rigged. Wonder what he has to say about us now, Anant said.
After honouring the worst in cinema, the awards also priased four of the movies from last year which were appreciated for their performance. Tigmanshu Dhulia's 'Saheb Biwi aur Gangster Returns' won the Anti Kela after being voted the best sequel by the voters. Other recipients of the Anti-Kela award were 'Go Goa Gone', 'The Lunchbox' and biopic 'Shahid'. Abhishek Sharma, who had himself won the Anti-Kela award for 'Tere Bin Laden' in 2012 collected the award on behalf of other recipients.
So my timing is off. I was supposed to be here three-four years ago and here I am now. I am also working on a project and I hope I to get a Kela award. With the rate with its going I am eyeing the Baawra Ho Gaya Hai Ke Award, he said. The song 'Party All Night' from 'Boss', which proved to be quite popular with listeners, was named the Most Irritating Song, while Sameer won the Most Atrocious Lyrics award for 'Raghupati Raghav' from 'Krrish 3'.
Tennis ace Leander Paes, who made his Bollywood debut with 'Rajdhani Express' was named the Worst Debutante. Actor Shahid Kapoor was given Why Are You Still Trying Award for 'R...Rajkumar', while Uday Chopra got the Aap Yahaan Aaye Kisliye Award. Bollywood diva Priyanka Chopra scored'The Aakhir Kyun Award' for her hit music video 'Exotic', which features American rapper Pitbull.
The Dara Singh Award for the Worst Accent was given to Padukone for 'Chennai Express'. 'Ra.One' Award for Worst Premise was shared by 'Dhoom 3' and Rakesh Roshan's 'Krrish 3'. While Rajshri Award for Most Regressive Film of the Year was won by Anand L Rai's 'Ranjhanaa'. Vivek Oberoi, who played the character of super villain Kaal in 'Krrish 3' bagged the This is Too Much Award. Sunny Deol scored Bas Kijiye Bahut Ho Gaya Award with his performance in 'Singh Sahab the Great'.
21:50 - By Unknown 0

Thursday, 27 March 2014

అజిత్‌కు షారూఖ్ సాయం


అజిత్‌కు  షారూఖ్ సాయం

 ప్రముఖ నటుడు అజిత్‌కు బాలీవుడ్ హీరో సా యం అందజేశారు. అదేం సాయం అనుకుంటున్నారా! వీరం చిత్రం తర్వాత దర్శకుడు గౌతం మీనన్ చిత్రంలో నటిస్తున్న అజిత్ ఇందుకోసం శరీర బరువు తగ్గించేందు కు ఇంట్లోనే జిమ్ ఏర్పాటు చేసుకుని వ్యాయామం చేస్తున్నారు. అజిత్ కు వెన్నెముకలో సమస్య ఉన్నందున ఇష్టమొచ్చిన రీతిలో బరువులు ఎత్తేందుకు వీలులేదు.

ఇందుకోసం ప్రత్యేకం గా ఒక ట్రెయినర్ కోసం అన్వేషించారు. ఈ విషయం తెలుసుకున్న హిందీ నటుడు షారుఖ్ ఖాన్ తన ట్రెయినర్‌ను అజిత్ ఇంటికి పంపారు. ఈ ట్రెయినర్ అజిత్ ఇంట్లోనే ఉంటూ శిక్షణ అందిస్తున్నారు.
04:42 - By Unknown 0

Wednesday, 26 March 2014

Sonam Kapoor pics

Image

Image

Image

Image

Image
22:15 - By Unknown 0

'సన్నిలియోన్ పై దేశ బహిష్కరణ విధించాలి'

'సన్నిలియోన్ పై దేశ బహిష్కరణ విధించాలి'
థానే: సన్నిలియోన్ పై దేశ బహిష్కరణ విధించి, రాగిణి ఎంఎంఎస్ 2 చిత్రంపై నిషేధం విధించాలని హిందూ జన్ జాగృతి సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు ఈ చిత్రంపై ఫిర్యాదు చేస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్ సీ) మెమోరాండం సమర్పించారు. ఈ చిత్రంపై నిషేధం విధించకపోతే.. రాగిణి ఎంఎంఎస్ 2 చిత్రం పదర్శించే సినిమా హాళ్ల వద్ద ఆందోళన చేపడుతామని హెచ్ జేఎస్ హెచ్చరించింది. 
 
భారతీయ సంస్కృతి, హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా ఉన్న రాగిణి ఎంఎంఎస్ 2 చిత్ర ప్రదర్శన నిలిపివేయాలని సీబీఎఫ్ సీకి విజ్క్షప్తి చేసింది. హిందువులు పవిత్రంగా భావించే శ్రీ హనుమాన్ చాలీసా మంత్రంతో ఈ చిత్రం ప్రారంభం కావడం ఆక్షేపనీయమని, దాని వల్ల మత, సామాజిక ఘర్షణలు తలెత్తే ప్రమాదముందని వారన్నారు. అసభ్యకరమైన చిత్రాల్లో నటిస్తూ యువతను రెచ్చగొడుతున్న సన్నిలియోన్ ను దేశం నుంచి బహిష్కరించాలని మెమోరాండంలో డిమాండ్ చేశారు. 
08:34 - By Unknown 0

సల్మాన్ తో జంటగా ఇలియానా


NewsListandDetails
టాలీవ్ఞడ్‌లో తనదైన ముద్రవేసి 'జులాయి తర్వాత  పూర్తిగా బాలీ వ్ఞడ్‌పైనే దృష్టిపెట్టిన గోవా సుందరి ఇలియానా అక్కడ వరుసగా మంచి అవకాశాలను సంపాదిస్తోంది. తాజా గా టాప్‌ హీరో సల్మాన్‌ఖాన్‌ సర సన  ఛాన్స్‌ సంపాదించేసింది. ఫ్యామిలీ  డ్రామా మేళవించిన లవ్‌స్టోరీలు  తీయడంలో పేరు పొందిన సూరజ్‌బర్జాత్యా డైరెక్ట్‌ చేయబోతున్న  ఓ సినిమాలో  సల్మాన్‌కు జోడీగా ఎంపికైంది  ఇలి యానా. వాస్తవానికి ఈ  పాత్రకు కరీనాకపూర్‌ను తీసుకోవాలని భావిం చాడు సూరజ్‌. కానీ చివరి నిమి షంలో ఆమెతప్పుకోవడంతో  ఇప్పు డు  ఆ క్యారెక్టర్‌ ఇలియానాను వరించింది. ఇప్పటికే బాలీవ్ఞడ్‌లో 'బర్ఫీ, 'ఫటాపోస్టర్‌ నిక్లా హీరో సినిమాలు చేసిన ఆమె ప్రస్తుతం రెండు, మూడు సినిమాల్లో నటి స్తోంది. హీరో సినిమాలు చేస్తోంది.  ఎనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సూరజ్‌ బర్జాత్యా డైరెక్ట్‌ చేస్తున్న సినిమాలో హీరోయిన్‌గా  నటించ నుండడం పట్ల ఆనందం వ్యక్తం చేసిన ఇలియానా ఆ సినిమాలో భాగం కావడాన్ని గౌరవంగా భావి స్తున్నానని తెలిపింది. సల్మాన్‌, సూరజ్‌ కాంబినేషన్‌లో ఇదివరకు వచ్చిన 'మైనే ప్యార్‌కియా, 'హమ్‌ ఆప్‌కే హై కౌన్‌, 'హమ్‌ సాథ్‌ సాథ్‌ హై సినిమాలు ఘన విజయాన్ని సాధించాయి. అందుకే ఆ కాంబినేష న్‌లో వస్తున్న తాజా సినిమా పట్ల అందరూ ఆసక్తిని కనబరుస్తున్నారు.
00:53 - By Unknown 0

'పచ్చి మిరపకాయ' గుర్తుతో రాఖీ సావంత్ కొత్త పార్టీ!


NewsListandDetails
బాలీవుడ్ ఐటమ్ గర్ల్ రాఖీ సావంత్ లోకసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉవ్విల్లూరుతోంది. అవకాశం లభిస్తే బీజేపీ తరపున పోటీ చేస్తానని లేకపోతే స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధమవుతోంది. ఇంకా విశేషమేమిటంటే పచ్చి మిరపకాయ గుర్తుతో ఓ పార్టీనే ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది.
 
తన ఆలోచణల్ని ఆచరణలో పెట్టేందుకుగాను జైన మతానికి చెందిన సాధువు పులక్ సాగర్ ను రాఖీ సావంత్ సోమవారం కలిసి ఆశీస్సుల్ని పొందారు. నిన్న ఆగ్రాకు చేరుకున్న రాఖీ సావంత్.. సాధువుతో రహస్య సమావేశం జరిపినట్టు సమాచారం.
 
లోకసభ ఎన్నికల్లో ముంబై వాయవ్య ముంబై స్థానం నుంచి గురుదాస్ కామత్ పై పోటి చేయాలని నిర్ణయం తీసుకుంది. ఒకటి రెండు రోజుల్లో కొత్త పార్టీని ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.
 
ప్రధాని పీఠంపై నరేంద్రమోడీని కూర్చుండ పెట్టేందుకు తాను కృషి చేస్తానని రాఖీ సావంత్ తెలిపారు. ఇకపై బాలీవుడ్ లో ఐటమ్ గర్ల్ పాత్రలకు స్వస్తి చెప్పనున్నట్టు.. మంచి పాత్రలు లభిస్తే నటిస్టానని సావంత్ తెలిపింది.

00:06 - By Unknown 0

Tuesday, 25 March 2014

షారుక్ ఖాన్ బకరా!


షారుక్ ఖాన్ బకరా!
 ‘నన్నేమైనా బకరా అనుకున్నావా...’ అని కొన్ని సందర్భాల్లో అంటుంటాం. ఎదుటి వ్యక్తి మోసం చేస్తున్నాడేమోననే ఫీలింగ్ వచ్చినప్పుడు ఇలా అనడం సహజం. ఇప్పుడు బాలీవుడ్‌లో షారుక్ ఖాన్ కూడా ‘బకరా’ అయ్యారు. అయితే, ఆయన్ని ఎవరూ మోసం చేయలేదు. ‘యే హై బక్రాపూర్’ అనే సినిమాలో ఓ మేకకి షారుక్ ఖాన్ పేరు పెట్టారు.

ఒక మధ్యతరగతి కుటుంబం, ఓ మేక చుట్టూ తిరిగే కథతో జానకి విశ్వనాథన్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రమేష్ ఎస్. అరుణాచలం నిర్మించారు. త్వరలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకకి షారుక్ ఖాన్ పేరు పెట్టడంవల్ల ఆయనేమైనా ఫీలవుతారేమోనని దర్శక, నిర్మాతలు సందేహించారు. టైమ్ బాగాలేక షారుక్ అడ్డం తిరిగి, సినిమా విడుదలను అడ్డుకుంటారేమోనని భావించారు. దాంతో షారుక్ ఖాన్ మేనేజర్, ఆయన ఇతర బృందానికి ఈ సినిమా చూపించాలని నిర్ణయించుకున్నారు. షారుక్ గౌరవానికి భంగం కలిగేలా ఏదైనా సీన్ ఉందని ఆ బృందం భావిస్తే, మార్చేస్తారట. ఏదేమైనా ఆ మేక మాత్రం సెలబ్రిటీ అయ్యిందని చెప్పొచ్చు..
20:22 - By Unknown 0

narrowsidebarads

Post your AD here 300x250 AD TOP

...
© 2014 HOT NEWS. WP Theme-junkie converted by Bloggertheme9
Powered by Blogger.
back to top