ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడినట్లు ఆమె గురువారం రాత్రి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. కాగా ప్రీతి ఫిర్యాదు మేరకు ముంబయి మెరైన్ డ్రైవ్ పోలీసులు నెస్ వాడియాపై పలు సెక్షన్ల (354, 504, 506,509 సెక్షన్లు) కింద కేసు నమోదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నెస్ వాడియా, ప్రీతి జింతాల మధ్య గతంలో ప్రేమ వ్యవహారం నడిచిన విషయం తెలిసిందే.
ఇద్దరూ కలిసి గతంలో ఐపీఎల్ పంజాబ్ టీంకు ఓనర్లుగా ఉన్నారు. కొంత కాలం తర్వాత ఇద్దరూ విడిపోయారు. ఇప్పుడు ఒకరంటే ఒకరికి పడనంత శత్రుత్వం. చివరికి వీరిద్దరి వ్యవహారం పోలీస్ స్టేషన్ కి చేరటం విశేషం. మరోవైపు ప్రీతి ఫిర్యాదును నెస్ వాడియా తోసిపుచ్చారు. ఆ ఆరోపణల్లో వాస్తవం లేదని తెలిపారు
0 comments:
Post a Comment