తణుకు/నరసాపురం : ‘నా జోలికి ఎవరూ రారు.. వచ్చే ధైర్యం ఎవరికీ లేదని’ జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. జిల్లాలోని తణుకు, నరసాపురంలో శుక్రవారం మధ్యాహ్నం ఎన్నికల సభలు నిర్వహించారు. తణుకు షర్మిష్ట సెంటర్, జాతీయ రహదారి దగ్గర నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ పార్టీలో బలమైన నాయకుల కొరత ఉందని, అందువల్లే ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదని చెప్పారు.
నాయకులు చేరితే 2019లో జనసేన తరఫున పోటీ చేస్తామన్నారు. కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడ అవినీతి జరిగినా పోరాటానికి సిద్ధంగా ఉన్నానన్నారు. తణుకు సభకు బీజేపీ, టీడీపీ నాయకులు లారీల్లో జనాన్ని తరలించారు. షెడ్యూల్ ప్రకారం 11.30కి రావాల్సి ఉండగా మూడు గంటలకు రావడంతో అప్పటి వరకు ఎండలో ఉండలేక అభిమానులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తణుకులో పవన్ కల్యాణ్ సినీ హీరో కాబట్టి వచ్చామే తప్ప ఆ పార్టీపై అభిమానంతో కాదని సభకు హాజరైనవారు బహిరంగంగా చెప్పటం టీడీపీ శ్రేణులకు ఇబ్బందిగా మారింది.
వచ్చినవారికి మంచినీరు సైతం టీడీపీ కార్యకర్తలు అందచేయకపోవడంతో జనసేన అభిమానులు నిరసన వ్యక్తం చేశారు. నరసాపురంలో టేలర్ హైస్కూల్ వద్ద నిర్వహించిన సభలో పవన్ ఊకదంపుడు ప్రసంగంతో అభిమానులు నిరుత్సాహపడ్డారు. సభకు జనం హాజరు అంతంతమాత్రంగానే ఉంది. ఈ సభల్లో బీజేపీ, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

0 comments:
Post a Comment