నలుగురిలో నిల్చుంటే ఎవరైనా ఏదైనా అంటారు. అందులో అడ్డగోలు ప్రచారం తెరవెనుక చాపకింద నీరులా సాగించడం అన్నది తెలుగుదేశానికి రాజకీయాలతో పెట్టిన విద్య. జగన్ లాంటి భయంకరమైన శతృవును ఆ పార్టీ ఎందుకు ఊరుకే వదుల్తుంది. అందుకే జగన్ పై రకరకాల వార్తలు, వదంతలు షికారు చేసాయి. దానికి పర్యవసానంగా కొన్ని వర్గాలు జగన్ కు దూరం అయ్యాయి కూడా. కానీ ఇక్కడ ఒకటే సందేహం. సహజంగా పార్టీ తరపున అధికార ప్రతినిధులో, లేదా ద్వితీయ శ్రేణి నాయకులో అథినేతకు రక్షణ కవచంలా వుండి, అలాంటి ఆరోపణలను ఎప్పటికప్పుడు ఖండిస్తుంటారు. కానీ వైకాపా, జగన్ దగ్గరకు వచ్చేసరికి అలాంటి వ్యవహారం ఎక్కడా అంతగా కనిపించలేదు. సత్యం రామలింగ రాజుకు, జగన్ కు తగాదా వచ్చిందని, కొట్టాడని ఎలా పుట్టించారో తెలియదు కానీ, వదంతి పుట్టిచారని వినికిడి. రాష్ట్రంలోని క్షత్రియుల్లో తొంభై శాతం మంది. జగన్ కు దూరం జరిగడానికి ఇదో కారణం అని వదంతి వుంది. అలాగే రోశయ్యను ముఖ్యమంత్రిగా దించేయడానికి జగనే కారణం అన్నదో వందంతి. జగన్ పదే పదే ఇబ్బంది పెడుతుంటే, అతగాడికి చెక్ చెప్పడానికి, రెడ్టి సామాజిక వర్గానికి చెందిన కిరణ్ ను సీన్లోకి తెచ్చారని ప్రచారం సాగింది. ఫలితంగా వైశ్యులు చాలా మంది జగన్ కు దూరమయ్యారు. అదే విధంగా తిరుపతి ఆలయ ప్రాంగణంలోకి చెప్పులతో వెళ్లారని మరొ కబురు. చినుకు చినుకు కలిస్తే గాలి వానగా మారిన చందంగా ఇలాంటి ప్రచారాలు కనిపించని హాని చేస్తాయి. ఇవన్నీ తెలిసి, ఎవరు సాగిస్తున్నారో తెలిసి కూడా జగన్ తరపు వారు ఖండించడం కానీ, దానికి వ్యతిరేక ప్రచారం సాగించడం కానీ ఎక్కడా కనిపించలేదు. ఒక్క షర్మిలతో తగవులు వచ్చాయన్న దానిపై మాత్రమే ఆమెతో ఇంటర్వూ ఇప్పించి, సర్దుబాటు చేసారు. సాధారణంగా సామాన్య జనం వదంతులను ఇట్టే నమ్మేస్తారు. అలాంటి వారికి పార్టీ తరపున సరైన రీతిలో సమాధానం అందించాల్సిన బాధ్యత నాయకులపై వుంటుంది. కానీ ఆ పని ఎవరూ ఎందుకు చేయలేదన్నది జవాబు దొరకని ప్రశ్న.
0 comments:
Post a Comment