చాలాకాలం తర్వాత భారత్, పాక్ ప్రధానమంత్రులు కలిశారు. చేతులు కలుపుకొన్నారు. మనసు విప్పి మాట్లాడుకున్నారు. పర్యటన ముగించుకుని, తేలికపడ్డ మనసుతో నవాజ్ షరీఫ్ సొంత దేశానికి పయనమయ్యారు. అయితే.. ఇంటికి వచ్చిన అతిథులను ఉత్త చేతులతో పంపడం మన దేశ సంప్రదాయం కాదు. అందుకే నరేంద్రమోడీ ఆయనకు ఓ మంచి బహుమతి ఇచ్చారు. (చదవండి: మోడీని చూసి నవాజ్ షరీఫ్ భావోద్వేగం)
ఇద్దరి మధ్య తల్లికి సంబంధించిన విషయాల గురించి చర్చ వచ్చింది కాబట్టి, నవాజ్ షరీఫ్ తల్లికి ఓ మంచి శాలువాను మోడీ బహూకరించారు. తన తరఫున ఆమెకు ఇవ్వాలని కోరారు. ఆ గిఫ్టు చూసి నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం షరీఫ్ చాలా ఆనందపడిపోయింది. గిఫ్టు చాలా బాగుందని, తన తండ్రి ఆ అందమైన శాలువాను స్వయంగా తీసుకెళ్లి నాయనమ్మకు ఇచ్చారని ట్విట్టర్ ద్వారా తెలిపింది. అంతేకాదు, తన కామెంట్ తో పాటు ఆ బహుమతి ఫొటోను కూడా పెట్టింది.
0 comments:
Post a Comment