హైదరాబాద్:తెలంగాణలో 15 మున్సిపాలిటీల్లో కాంగ్రెసు, 9 మున్సిపాలిటీల్లో తెరాస, టిడిపి 3 మున్సిపాలిటీల్లో విజయం సాధించాయి. బిజెపి రెండు మున్సిపాలిటీలను గెలుచుకుంది. వేములవాడతో పాటు నారాయణ్‌ఖేడ్ మున్సిపాలిటీని కూడా బిజెపి దక్కించుకుంది. తెలంగాణలోని రామగుండం కార్పోరేషన్‌ను కాంగ్రెసు గెలుచకుంది. మెదక్ జిల్లా గజ్వెల్‌లో టిడిపి విజయం సాధించింది.
సీమాంధ్రలో టిడిపి 30 మున్సిపాలిటీల్లో, వైసిపి 6 మున్సిపాలిటీల్లో విజయం సాధించింది. తెలంగాణలో కాంగ్రెసు 8, తెరాస 7, టిడిపి 3 మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నాయి.
సత్తుపల్లి మున్సిపాలిటీని టిడిపి కైవసం చేసుకుంది. పెడన హంగ్ అయింది. రాజమండ్రి కార్పోరేషన్‌లో టిడిపి సైకిల్ దూసుకుపోతోంది. నెల్లురు జిల్లా సూళ్లూరుపేట మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. మున్సిపాలిటీ ఫలితాల్లో తెలంగాణలో కాంగ్రెసుపై తెరాస ఆధిక్యం సాధిస్తుండగా, సీమాంధ్రలో సైకిల్ జోరు మీదు ఉంది. సీమాంధ్రలో కాంగ్రెసు ఖాతా తెరవలేదు. ప్రకాశం జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో టిడిపికి ఆరు, వైయస్సార్ కాంగ్రెసు రెెండు దక్కాయి. బెల్లింపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెసు విజయం సాధించింది. దేవరకొండ మున్సిపాలిటీ కూడా కాంగ్రెసు వశమైంది. వేములవాడ మున్సిపాలిటీని బిజెపి దక్కించుకుంది. సీమాంధ్రలో ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో టిడిపి 6 మున్సిపాలిటీలను కైవసం చేసుకోగా, వైయస్సార్ కాంగ్రెసుకు రెండు దక్కాయి. పాలకొండ మున్సిపాలిటీలో టిడిపి విజయం సాధించింది. పార్వతీపురం టిడిపికి దక్కింది. తెలంగాణలో ఆరు మున్సిపాలిటీల్లో తెరాస విజయం సాధించింది. కాంగ్రెసు నాలుగు, టిడిపి రెండు మున్సిపాలిటీలను గెలుచుకున్నాయి. కరీంనగర్ జిల్లా వేములవాడలో బిజెపి విజయం సాధించింది. రేపల్లెలో టిడిపి సత్తా చాటింది. హుజురాబాద్ మున్సిపాలిటీని తెరాస దక్కించుకుంది. పెద్దాపురం మున్సిపాలిటీ టిడిపి కైవసమైంది. మడకశిరలో ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డికి షాక్ తగిలింది. అక్కడ తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. అదిలాబాద్ జిల్లా భైంసా మున్సిపాలిటీలో మజ్లీస్ విజయం సాధిచింది. తెలంగాణలోని జనగాం, నర్సంపేట మున్సిపాలిటీల్లో అధిక స్థానాలను కాంగ్రెసు దక్కించుకుంది. రామచంద్రపురం మున్సిపాలిటీలో తెలుగుదేశం అత్యధిక స్థానాలు గెలుచుకుంది, అయితే చైర్మన్ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. ఆళ్లగడ్డ, గిద్దలూరు వైయస్సార్ కాంగ్రెసు వశమయ్యాయి. ఆందోల్ మున్సిపాలిటీ కాంగ్రెసు కైవసం చేసుకుంది. అముదాలవలస, తుని మున్సిపాలిటీలు వైసిపి చేజిక్కాయి. కరీంనగర్ కార్పోరేషన్‌ను తెరాస దక్కించుకుంది. చిలకలూరిపేట మున్సిపాలిటీలో అత్యధిక వార్డులను వైయస్సార్ కాంగ్రెసు గెలుచుకుంది. భైంసా మున్సిపాలిటీలో మజ్లీస్ ఆధిక్యం కొనసాగిస్తోంది. సీమాంధ్రలో ఏడు మున్సిపాలిటీల్లో తెలుగుదేశం పార్టీ పాగా వేసింది. అమలాపురం మున్సిపాలిటీలో టిడిపి హవా కొనసాగించింది. అత్యధిక వార్డులను గెలుచుకుంది. అద్దంకి, ముమ్మిడివరం, కనిగిరి, మండపేట మున్సిపాలిటీల్లో టిడిపి గాలి వీచింది. చీమకుర్తి, యలమించిలి కూడా టిడిపి కైవసం చేసుకున్నట్లు వార్తలు అందుతున్నాయి. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధిక స్థానాలను కైవసం చేసుకుంది. రాష్ట్రంలో ఇటీవల జరిగిన పురపాలక సంఘాల ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం ప్రారంభమైంది. రాష్ట్రంలోని 145 మునిసిపాలిటీలు, 10 కార్పొరేషన్ల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఈ 155 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేసింది. కౌంటింగ్ కేంద్రాలవద్ద 144 సెక్షన్ విధించారు. మున్సిపల్ ఫలితాలు వెల్లడి సందర్భంగా మద్యం దుకాణాలు మూసివేయాలని ఈసీ ఆదేశాలు ఇచ్చింది. మున్సిపాలిటీలు, నగరపంచాయతీల్లో 39 చోట్ల అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని రమాకాంత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని 22 జిల్లాల్లో 65 ప్రాంతాల్లో 155 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మున్సిపాలిటీల్లో రెండు రౌండ్ల లెక్కింపు జరుగుతుంది. నగరపాలక సంస్థల్లో నాలుగు రౌండ్ల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఏజెంట్లను లెక్కింపు కేంద్రాల వద్దకు అనుమతించడం లేదు. దీంతో ఓట్ల లెక్కింపు సందర్భంగా గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో ఏజెంట్లు, పోలీసుల మధ్య వాగ్వివాదం జరిగింది.
0 comments:
Post a Comment