టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ క్రేజీ మూవీకు సంబంధించిన కథ లీకైందనే వార్తలు గత కొంత కాలంగా వినిపిస్తూనే ఉన్నాయి. ఆ కథే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీది. గబ్బర్ సింగ్ 2 మూవీకు సంబంధించిన కథ లీకైంది. అయితే లీకైన కథపై మాత్రం అందిలోనూ అనుమానాలు ఉన్నాయి. గబ్బర్ సింగ్2 కథకి సంబంధించిన క్లియర్ స్టోరిను frame143.blogspot.com ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. నిన్నటి వరకూ పొలిటికల్ స్పీచులతో దుమ్మురేపిన పవన్ ఇక, సినిమా డైలాగులు చెప్పబోతున్నాడు. మే నెల చివరి వారం నుంచి ‘ఓ మైగాడ్’ రీమేక్ షూటింగ్ కు పవన్ రెడీ అవుతున్నాడు. అయితే ఈ మూవీకు ‘దేవ దేవమ్ బజే’ అనే టైటిల్ ఫిక్స్ చేశారట.
టైటిల్ క్యాచీగా లేకపోయినా ఒరిజినల్ టైటిల్ కు చాలా దగ్గరగా ఉండటంతో ఈ టైటిల్ నే చిత్ర యూనిట్ ఓకె చేసిందనే టాక్ వినిపిస్తుంది. మరోవైపు ‘గబ్బర్ సింగ్ -2′ కు సంబంధించి మరో ఆసక్తి కరమైన అంశాలు వినిపిస్తున్నాయి. ఒరిజినల్ గా పొలిటికల్ పార్టీ పెట్టిన పవన్, ఈ సినిమాలోనూ రాజకీయ నాయకుడిగానే కనిపించబోతున్నాడనే టాక్ ఇప్పుడు టాలీవుడ్ లో హల్ చల్ చేస్తుంది. ఇన్నాళ్లూ వెయిట్ చేసిన తర్వాత పవన్ ఫైనల్ చేసిన స్క్రిప్ట్ ఇదేనట.
పోలీస్ ఆఫీసర్ గా చంబల్ లోయకు వెళ్లే పవన్.. అక్కడ ఓ రాజకీయ నాయకుడితో జరిగే వాగ్వాదంతో ఎమ్మెల్యేగా గెలుస్తానని ఛాలెంజ్ చేసి మరీ గెలుస్తాడట. ఎన్నికల్లో పోటీ చేయకుండానే త్వరలోనే ఎమ్మెల్యేగా ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు పవన్. అయితే రాజకీయ నాయకుడిగా కొత్త అవతారం ఎత్తాడు కాబట్టి, నిన్నటి అభిమానం ఇంకా ఆడియన్స్ లో ఉంటుందా అనే విషయం కూడా ఈ సినిమాలతో తేలిపోతుంది. ఈ మూవీ కథపై సినీ ఇండస్ట్రీలోనూ ఆసక్తికరమైన చర్ఛ జరగుతుంది. పవన్ పొలిటికల్ గెటప్ కలెక్షన్స్ వర్షం ను కురిపిస్తుందా? ఈ టాపిక్ పై మీ కామెంట్స్ ను ఇక్కడ పోస్ట్ చేయండి.
0 comments:
Post a Comment