సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర)లోని మొత్తం శాసనసభ నియోజకవర్గాల్లో అందరికన్నా అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు. పులివెందుల నుంచి తన సమీప ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి ఎస్వీ సతీశ్‌కుమార్‌రెడ్డిపై ఏకంగా 75,243 ఓట్ల మెజారిటీ సాధించారు.
సీమాంధ్రలోని మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధిక మెజారిటీ ఇదే! ఆ తరువాత మెజారిటీని విశాఖపట్నం జిల్లాలోని విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీచేసిన టీడీపీ అభ్యర్థి వెలగపూడి రామకృష్ణబాబు సాధించారు. ఆయనకు 47,883 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఆ తరువాత స్థానంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఉన్నారు.
ఆయన తన సమీప వైఎస్సార్‌సీపీ ప్రత్యర్థి చంద్ర మౌళిపై 47,121 ఓట్ల మెజారిటీని సాధించారు. టీడీపీ రెబెల్ అభ్యర్థిగా తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నుంచి పోటీచేసిన వర్మ 47,080 ఓట్ల మెజారిటీతో గెలిచారు.

About the Author

0 comments:
Post a Comment