ముంబై: రాజకీయాల్లో కొనసాగుతానని, కేవలం లోకసభ ఎన్నికలకే పరిమితం కానని ఆమ్ ఆద్మీ పార్టీ నేత, బాలీవుడ్ తార గుల్ పనాగ్ అన్నారు. ఓటమి వల్ల నిరుత్సాహానికి గురికావడం లేదని.. అరవింద్ కేజ్రీవాల్ తో కలిసి పనిచేస్తామని ఆమె అన్నారు.
చంఢీగఢ్ స్తానం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తరపున పోటి చేసిన గుల్ పనాగ్.. బీజేపీ అభ్యర్ధి, బాలీవుడ్ తార కిరణ్ ఖేర్ చేతిలో ఓటమి పాలయ్యారు. ప్రజల తీర్పుపై ఎలాంటి అసంతృప్తి లేదని, తనకు మద్దతు తెలిపిన చంఢీఘడ్ ప్రజలకు కృతజ్క్షతలు అని పనాగ్ మీడియాతో అన్నారు. తొలిసారి పోటి చేసిన తనకు భారీ స్థాయిలో ఓట్లు వచ్చాయన్నారు.

About the Author

0 comments:
Post a Comment