ఫలితాలు వెల్లడైన తరువాత ఎన్నికలలో ప్రచారం చేసినందుకు పవన్ కల్యాణ్‌కు బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ లు కృతజ్ఞతలు కూడా తెలిపారు. రాజ్ నాథ్ సింగ్ ఫోన్ లో ఎన్ డిఏ సమావేశానికి రావలసిందిగా పవన్ ను కోరారు. జనసేన పార్టీ ఎన్నికలలో పోటీ చేయలేదు. ఆ పార్టీ తరపున ఎంపిలు ఎవరూ లేరు. అయినా అతనిని పార్లమెంటు బోర్డు సమావేశానికి కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా రావాలని కోరినట్లు తెలిసింది. ఎన్ డిఏ సమావేశంలో పాల్గొనేందుకు పవన్ కళ్యాణ్ ఈ సాయంత్రం ఢిల్లీ బయలుదేరుతున్నట్లు సమాచారం.

About the Author

0 comments:
Post a Comment