ఎంతైనా వారిది ఘాటు ప్రేమ. ఒకానొక సంఘటనతో క్షణికావేశంలో వారి ప్రేమ భగ్నం అయ్యింది. దీంతో ఎవరి జీవితం వారిదన్న చందానా విడిపోయారు. అంతేకాదు ఎవరికిష్టమైన వారిని వారు ప్రేమించుకున్నారు. ఆ ప్రేమలు కూడా బ్రేకప్ అయ్యాయి. చాలా కాలం తరువాత మాజీ ప్రేమికులు మళ్లీ కలసి నటిస్తున్నారు. అంతేకాదు వారి మధ్య పాత ప్రేమ మళ్లీ బుసలు కొడుతోందని కోలీవుడ్ కోడై కూస్తోంది. ఇంతకీ ఆ సంచలన జంట ఎవరన్నది మీకీ పాటికి అర్థం అయి వుంటుంది. ఇంకెవరు ఆ జంట శింబు, నయనతారనే. వీరి మధ్య ప్రేమ వల్లవన్ చిత్రం షూటింగ్ సమయంలో మొలకెత్తింది. అప్పట్లో ఏ పేపర్‌లో చూసినా ఏ ఇంటర్‌నెట్‌లో తిలకించినా ఈ ఘాటు ప్రేమికుల గురించిన వార్తలే.
పెళ్లి వరకు వస్తుందనుకున్న వీరి ప్రేమ అనూహ్యంగా బ్రేక్ అయ్యింది. ఆ తరువాత నయనతార, ప్రభుదేవా ప్రేమలోను, శింబు హన్సిక ప్రేమలోను కొంతకాలం మునిగిపోయూరు. ఈ ప్రేమలు పెళ్లిళ్ల వరకూ వెళ్లి షరా మామూలే అన్నట్లుగా పెటాకులయ్యాయి. తాజాగా శింబు, నయనతార జంటగా ఇదు నమ్మ ఆళ్ చిత్రంలో నటిస్తుండడం విశేషం. అయితే వీరిద్దరి మధ్య మళ్లీ ప్రేమ మొదలు కావడం సంచలనంగా మారింది. ఇటీవల నటి త్రిష పుట్టినరోజు వేడుకలో శింబు, నయనతార పాల్గొని హల్‌చల్ చేశారు. ఇద్దరూ ఏకాంతంగా కూర్చొని చాలా సేపు ముచ్చటించుకోవడం, కలిసి విందులో ఎంజాయ్ చేయడం అక్కడ వున్న వారిని ఆశ్చర్యపరచింది. అలా
మళ్లీ మొదలయ్యింది శింబు, నయనతారల ప్రేమ అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు.

0 comments:
Post a Comment