రుణమాఫి పేరు చెప్పి అధికారం లోకి వచ్చిన చంద్రబాబు రుణమాఫి కి కేంద్రం, రిజర్వు బ్యాంకు ఒప్పుకోవట్లేదు
అంటూ కొత్త నాటకాలు మొదలు పెట్టారు .10 సంవత్సరాలు తనని ప్రతిపక్షంలో కూర్చోపెట్టిన రైతులను ఆడుకొని తర్వాత ఎంతో కొంత మాఫీ చేస్తే వాళ్లే పడి ఉంటారని బాబు ఆలోచన. 9 ఏళ్ళు అధికారం లో వున్నప్పుడు రైతులను , మహిళలను బానిసలు కంటే హీనంగా చుసిన బాబు అన్ని కులాల పేర్లు , నోటికి వచ్చిన హామీలు ఇచ్చి అధికారం లోకి వచ్చారు. ఇప్పుడు ఆ కమిటీ ఈ కమిటి అంటూ కాలయాపన చేస్తూ ప్రజల జీవితాలతో చలగాటం ఆడుతున్నాడు. ఇంటికో ఉద్యగం లేదు , రైతు స్తిరీకరణ నిధి లేదు, రైతులకు 9 గంటల నిరంతర విద్యుత్ లేదు , బి సి లకు ప్రత్యెక హోదా లేదు, బలిజలను ఇంకా బిసి జాబితాలో చేర్చలేదు , బ్రహ్మినుల కోసం ప్రత్యెక కమిటీ లేదు, విద్యార్దుల ఫీజు రాయతి కి సంబంధించి హామీ లేదు, చేనేత కార్మికులకు సహాయం లేదు, గర్భిని స్త్రీలకు 3వ నెల నుండి ప్రసవం అయ్యేంత వరకు ప్రభుత్వ సహాయము లేదు, ఇలాంటి ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీయ కుండ ఏమి చేస్తున్నారు. డబ్బులు తీసుకొని ఓటేశం ఇక మనకు సంభందం లేదు అనుకుంటున్నారేమో.
0 comments:
Post a Comment