హైదరాబాద్: అధికార దుర్వినియోగంలో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కేసులు పెట్టడం జరిగిందని తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ కోదండరామ్ అన్నారు. గత ప్రభుత్వాలు అనేక రకాలుగా అధికార దుర్వినియోగాలకు పాల్పడ్డాయని ఆయన వ్యాఖ్యలు చేశారు.
కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ పుస్తకావిష్కరణ సభలో కోదండరాం మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు అధికార దుర్వినియోగం చేసి అనేక మందిపై కేసులు పెట్టారని.. అందులో వైఎస్ జగన్‌పై కేసు పెట్టడం కూడా ఒకటి అని అన్నారు.
గుప్పెడు మంది వ్యక్తులకోసం ప్రభుత్వాలు చేయకూడని పనులన్నీ చేశాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపటి తెలంగాణ ప్రభుత్వంలో అలాంటివి జరగకుండా చూడాలని ఆయన హెచ్చరించారు.
0 comments:
Post a Comment