న్యూఢిల్లీ: ఢిల్లీలో మరో సామూహిక అత్యాచారం జరిగింది. 19 ఏళ్ల నేపాలీ అమ్మాయిపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. నేరానికి పాల్పడినవారిలో ఓ మైనర్ బాలుడు ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటన దక్షిణ ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలో జరిగింది. నిందితుల్లో ఒకతను అమ్మాయికి పరిచయం. దీన్ని ఆసరాగా తీసుకుని అమ్మాయిని అతను నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకుని వెళ్లాడు. అక్కడికి మరో ముగ్గురు చేరుకున్నారు. వారంతా కలిసి అమ్మాయిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. విషయాన్ని బయటకు చెప్తే తీవ్రమైన పరిణామాలుంటాయని నిందితులు బాధితురాలిని హెచ్చరించారు. అయితే, ఏదో విధంగా విషయం పోలీసులకు చేరే విధంగా ఆమె చేసింది. దాంతో పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులు తొలుత మైనర్ బాలుడిని పట్టుకున్నారు. అతని సహాయంతో సందీప్ (25), ఆశీష్ (20) అనే ఇద్దరు నిందితులను గుర్తించి, వారిని అదుపులోకి తీసుకున్నారు. అమ్మాయికి తెలిసిన నాలుగో నిందితుడు పరారీలో ఉన్నాడు. పనిమనిషిగా ఉపాధి కల్పిస్తానని అతను ఆ అమ్మాయికి వాగ్గానం చేసినట్లు సమాచారం. నలుగురు నిందితులు కూడా నిరుద్యోగులే.
0 comments:
Post a Comment