గతంలో ప్రభాస్ కన్నడలో హిట్ చిత్ర మైన 'యోగి చిత్రంలో నటించాడు. వి.వి.వినాయక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆశించినంత సక్సెస్‌ను సాధించ లేకపోయింది. కాగా 'బాహుబలి చిత్రం పూర్తయిన తర్వాత ప్రభాస్ మరో కన్నడ రీమేక్‌లో నటించనున్నాడని ఫిల్మ్‌నగర్ సమాచారం. కన్నడలో ఫిబ్ర వరిలో విడుదలై ఘన విజయం నమోదుచే సుకున్న 'ఉగ్రమ్ చిత్రం తెలుగు రీమేక్‌లో నటిం చడానికి ప్రభాస్ ఆసక్తి చూపిస్తున్నాడని సమాచారం. కన్నడలో ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో శ్రీమురళి,హరిప్రియ జంటగా వచ్చిన 'ఉగ్రమ్ మాస్ ప్రేక్షకులను విపరీతం గా ఆకట్టుకుంటోంది. మొదట్లో ఈ చిత్రంలో నటించడానికి ఎన్టీఆర్,అల్లు అర్జున్ వంటి హీరోలు ఆసక్తిచూపించారు. అయితే చివరకు ఈ చిత్రం ప్రభాస్ కాంపౌండ్‌లోకి వెళ్లిందట. ఈ చిత్రాన్ని చూసిన ప్రభాస్ ఈ సినిమాలో నటించేందుకు అంగీకారం తెలిపినప్పటికీ ప్రతిష్టాత్మక చిత్రం 'బాహుబలి పూర్తయ్యే వరకు ఆగమని చెప్పా డని సమాచారం. మొత్తానికి ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందో లేదో వేచిచూడాల్సిఉంది.
|
0 comments:
Post a Comment