Contact

Text

Wednesday, 4 June 2014

నెట్ లేకుండానే ఫేస్‌బుక్ యాక్సెస్


 న్యూఢిల్లీ:  మొబైల్ వినియోగదారులు ఇంటర్నెట్/డేటా కనెక్షన్ లేకుండానే ఫేస్‌బుక్‌ను యాక్సెస్ చేసుకునే సర్వీస్‌ను బీఎస్‌ఎన్‌ఎల్ అందిస్తోంది. ఈ సర్వీస్ కోసం 3 రోజులకైతే రూ.4, వారానికైతే రూ.10, నెలకైతే రూ.20 చొప్పున చార్జీ వసూలు చేస్తామని బీఎస్‌ఎన్‌ఎల్ డెరైక్టర్ అనుపమ్ శ్రీవాత్సవ  పేర్కొన్నారు. ఈ సర్వీస్ ద్వారా మొబైల్ వినియోగదారులు తమ ఫేస్‌బుక్ అకౌంట్లను యాక్సెస్ చేసుకోవచ్చని, మెసేజ్‌ల స్టేటస్‌ను చూడొచ్చని, మెసేజ్‌లను పోస్ట్ చేయవచ్చని, ఫ్రెండ్ రిక్వెస్ట్‌లకు స్పందించవచ్చని, ఫ్రెండ్స్ వాల్స్‌పై రైట్ చేయవచ్చని, బర్త్‌డే రిమైండర్స్‌ను చూడొచ్చని, ఎలాంటి ఇంటర్నెట్/డేటా కనెక్షన్ లేకుండానే మెసేజ్‌లు పంపించవచ్చని వివరించారు.

యూఎస్‌ఎస్‌డీ ద్వారా యుటోపియా మొబైల్ భాగస్వామ్యంతో ఈ సర్వీస్‌ను అందిస్తున్నామని పేర్కొన్నారు.  అన్ని రకాల మొబైల్ ఫోన్లలలో ఈ సర్వీస్‌ను ఉపయోగించుకోవచ్చని వివరించారు. తూర్పు, దక్షిణ జోన్లలో ఈ సర్వీస్‌ను తక్షణం అందిస్తామని, ఆ తర్వాత పశ్చిమ, ఉత్తర జోన్లకు విస్తరిస్తామని తెలిపారు. టెలికం కంపెనీలు  అన్‌స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా(యూఎస్‌ఎస్‌డీ) టెక్నాలజీ ద్వారా తమ మొబైల్ వినియోగదారులకు అలర్ట్‌లు పంపిస్తాయి. ఈ టెక్నాలజీ ద్వారానే బీఎస్‌ఎన్‌ఎల్ ఈ సర్వీస్‌ను అందిస్తోంది.
06:59 - By Unknown 0

Tuesday, 3 June 2014

వివాహేతర సంబంధంతో కొడుకు హత్య



తిరుపతి : మూడు రోజుల క్రితం తిరుపతి సమీపంలో జరిగిన బాలుడి మురళి హత్యకేసు మిస్టరీని పోలీసులు చేధించారు. బాలుడి తల్లి అరుణ, ఆటో డ్రైవర్ సోమశేఖర్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. అక్రమ సంబంధం కారణంగానే వారు బాలుడిని హతమార్చినట్లు తెలుస్తోంది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని తిరుపతి శివారులోని ఓ హోటల్ లో  విచారిస్తున్నారు. నిందితుడిని రాత్రికి మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

వివరాల్లోకి వెళితే...చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం తొండవాడ ప్రాంతంలోని బైపాస్‌రోడ్డుకు సమీపంలో నిర్జన ప్రదేశంలో తొమ్మిదేళ్ల వయసు కలిగిన బాలుడిని పెట్రోల్ పోసి సజీవదహనం చేశారు. ఈ సంఘటన శనివారం వెలుగుచూసింది. బాలుడు 80 శాతం కాలిపోయి గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాడు. అయతే మెడలోని తాయత్తు, చేతిలోని కంకణం ద్వారా మృతిచెందిన బాలుడు టిటిడి చైర్మన్ కార్యాలయంలో అటెండర్‌గా పనిచేసే మునిరత్నం కుమారుడు మురళిగా పోలీసులు గుర్తించారు. అతని చొక్కా జేబులో ఉన్న చాక్లెట్ కూడా అలాగే ఉంది. గుర్తుపట్టకుండా చేసేందుకు మాత్రమే ముఖంపైన పెట్రోల్ పోసి కాల్చివేశారు.

మునిరత్నంరెడ్డి, భార్య అరుణ, కుమార్తె హేమశ్రీ(12), మురళి(9)తో నివాసం ఉంటున్నాడు. శుక్రవారం సాయంత్రం 5గంటల సమయంలో మురళి ఆడుకుంటానని ఇంటి నుండి వెళ్లి రాత్రి పదిగంటలు అయినా ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు చుట్టుపక్కల వెదకి అలిపిరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో విచారించి మూడురోజుల్లోనే మిస్టరీని చేధించారు
07:08 - By Unknown 0

భార్య అందంగా లేదని...


విజయవాడ: అందంగా లేదంటూ భార్యను అంతమొందించేందుకు ప్రయత్నించాడో కిరాతక భర్త. విజయవాడ నగరంలోని మొగల్రాజపురంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. వివరాలు....


అనుపమ్, శిరీషకు రెండేళ్ల క్రితం వివాహమయింది. వీరికి ఆరు నెలల పాప ఉంది. భార్య అందంగా లేదన్న కారణంతో మంగళవారం ఉదయం శిరీషపై కిరోసిన్ పోసి నిప్పటించి చంపేందుకు ప్రయత్నించాడు. మంటల్లో చిక్కుకున్న శిరీష భర్తను పట్టుకోవడంతో అతడికి కూడా గాయాలయ్యాయి.

శిరీషకు దాదాపు ఒళ్లంతా కాలిపోవడంతో ఆమె పరిస్థితి విషమంగా ఉంది. అనుపమ్ కు స్వల్పంగా గాయాలయ్యాయి. పెళ్లికి ముందే అనుపమ్ కు ఓ అమ్మాయితో పరిచయం ఉందని తెలిసింది. పెళ్లైన తర్వాత కూడా అతడు వివాహేతర సంబంధం కొనసాగిస్తుండడంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని చెబుతున్నారు. ఈ క్రమంలోనే శిరీషపై అతడు హత్యాయత్నం చేసినట్టు సమాచారం.
07:04 - By Unknown 0

మహిళా జడ్జిపై అత్యాచారం.. హత్యాయత్నం


లక్నో : ఉత్తరప్రదేశ్ లో మహిళలు ఎంత ఉన్నతస్థానంలో ఉన్నా కూడా వారికి ఏమాత్రం రక్షణ ఉండట్లేదు. చివరకు ఓ మహిళా జడ్జిని కూడా అక్కడి ముష్కరులు వదల్లేదు. అలీగఢ్ లో ఓ మహిళా జడ్జిపై అత్యాచారం చేయడమే కాక, ఆమెపై హత్యాయత్నం కూడా చేశారు. ఆమె తన అధికారిక నివాసంలో స్పృహ లేకుండా పడి ఉన్నారు. ఆమెకు విపరీతంగా డ్రగ్స్ ఇచ్చి, ఆపై అత్యాచారం చేశారు. ఆమె శరీరంపై లెక్కలేనని్న గాయాలున్నాయి. బాధితురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు అత్యాచారం కేసు నమోదు చేసినట్లు సీనియర్ ఎస్పీ నితిన్ తివారీ తెలిపారు.

బాధితురాలు ఇంకా పూర్తిగా స్పృహలోకి రాకపోవడంతో ఇంకా ఆమెకు వైద్య పరీక్షలు ఏమీ చేయలేదని, ఆమెను విచారించే స్థితిలోకి వచ్చిన తర్వాతే చేయిస్తామని ఆయన అన్నారు. సగం ఖాళీ అయిన పురుగుమందు సీసా కూడా సంఘటన స్థలంలో ఉందని అధికారులు చెప్పారు. బహుశా భయంతోనే దుండగులు ఆమెకు బలవంతంగా పురుగుమందు తాగించి ఉంటారని అన్నారు. మహిళా జడ్జి పరిస్థితి ఇంకా విషమంగానే ఉండటంతో.. ఆమెను ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.
07:03 - By Unknown 0

బుల్లెట్ లాంటి పాత్రలో బాలయ్య

బాలకృష్ణ... తన 98వ సినిమాకు కొబ్బరికాయ కొట్టారు. ఈ చిత్రం ద్వారా సత్యదేవ్ అనే కొత్త దర్శకునికి ఆయన అవకాశం ఇవ్వడం విశేషం. ఎస్.ఎల్.వి. సినిమా పతాకంపై రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన తొలిసారి త్రిష కథానాయికగా నటించనుండటం మరో విశేషం. సోమవారం హైదరాబాద్‌లో ఈ చిత్రం ఘనంగా ప్రారంభమైంది. కె.రాఘవేంద్రరావు పూజా కార్యక్రమాలు నిర్వహించగా, బాలకృష్ణపై చిత్రీకరించిన ముహూర్తపు దృశ్యానికి రమేశ్‌ప్రసాద్ కెమెరా స్విచాన్ చేయగా, దాసరి క్లాప్ ఇచ్చారు. బి. గోపాల్ గౌరవ దర్శకత్వం వహించారు. సత్యదేవ్ మాట్లాడుతూ - ‘‘బాలకృష్ణ గారి కోసమే తయారు చేసుకున్న కథ ఇది.
 

  మూడేళ్ల క్రితమే ఈ కథను సిద్ధం చేసుకున్నాను. నా ఆకాంక్షను నిజం చేస్తూ ఈ కథకు ఆయనే నాయకుడు కావడం ఆనందంగా ఉంది. గన్ నుంచి బయటకొచ్చిన బుల్లెట్ ఎంత శక్తిమంతంగా, ఫోర్స్‌గా ఉంటుందో ఇందులో బాలయ్య పాత్ర అంత శక్తిమంతంగా ఉంటుంది. తాను ఎంచుకున్న లక్ష్యాన్ని ఛేదించడంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనకాడని పాత్ర అయనది. యాక్షన్, కామెడీ, రొమాన్స్, కుటుంబ విలువలు అన్నీ సమపాళ్లలో ఉండే కథ ఇది. ‘లెజెండ్’ లాంటి సూపర్‌హిట్ తర్వాత, అందునా బాలయ్యగారు ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే.. నా సినిమానే చేయడం చాలా గర్వంగా ఉంది.
 
 నన్ను, కథను నమ్మి ఇంతటి భారీ ప్రాజెక్ట్‌ని భుజాలపై వేసుకున్న నిర్మాతకు ముఖ్యంగా నా కృతజ్ఞతలు. బాలకృష్ణగారు ఇప్పుడు ప్రజానాయకుడు కూడా కాబట్టి, ఆయన వెసులుబాటును బట్టే ఈ చిత్రం షెడ్యూల్స్ ఉంటాయి’’ అని తెలిపారు. ‘‘బాలకృష్ణగారి సినిమాకు నిర్మాతను కావడం గర్వంగా ఉంది. బాలకృష్ణగారికి ఎన్నో మ్యూజికల్ హిట్స్ ఇచ్చిన మణిశర్మ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. హిట్ ఆల్బమ్ ఇవ్వలేకపోతే... మ్యూజిక్ డెరైక్షన్ చేయడమే వదులుకుంటానని ఛాలెంజ్ చేసి మరీ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
 
 ఇప్పటికే అద్భుతమైన మూడు ట్యూన్స్‌ని రెడీ చేశారు కూడా. అలీ కామెడీ ఈ చిత్రానికి మరో హైలైట్’’ అని చెప్పారు. కేవలం కథను నమ్మి కొత్తవారైనా సత్యదేవ్‌కి బాలయ్య ఈ అవకాశం ఇచ్చారని, బాలకృష్ణగారి కెరీర్‌లో ఇదో కలికితురాయిలా నిలిచిపోవాలని అలీ ఆకాంక్షించారు. చంద్రమోహన్, జయసుధ, ప్రకాశ్‌రాజ్, అలీ, గీత తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వెంకట్‌ప్రసాద్, కూర్పు: గౌతంరాజు, సమర్పణ: రుద్రపాటి ప్రేమలత.
07:01 - By Unknown 0

Monday, 2 June 2014

వాడిని తిట్టడానికి ఏ భాషలోనూ పదాలు లేవు!

బెంగళూరు: నీచుడు - నికృష్టుడు - ద్రోహి - కసాయి - కిరాతకుడు - కఠినాత్ముడు - పాపాత్ముడు - మూర్ఖుడు- కామాంధుడు - కఠినాత్ముడు - ఖర్కోటకుడు- రాక్షసుడు - క్రూరమృగం....ఇలాంటి పదాలు ఎన్నైనా చాలవు ఈ ముసలి నక్కకు పెట్టడానికి. ఇంతటి నీచాతి నీచుడు, పరమ నికృష్టుడిని  తిట్టడానికి ఏ భాషలోనూ సరైన పదాలు ఉండి ఉండవు. కన్న కూతురని కూడా చూడకుండా మైనర్ బాలికపై ఓ కిరాతక తండ్రి  ఏడు నెలలుగా అత్యాచారం చేశాడు.  ఆ బాలిక గర్భవతి కావడంతో విషయం కాస్తా బహిర్గతమైంది.  హాసన్ జిల్లా అరకలగూడు తాలూకా శానభోగనహళ్లి గ్రామానికి చెందిన 60 ఏళ్ల వృద్ధునికి  14 సంవత్సరాల కుమార్తె ఉంది. అతని భార్య కూలి పనులకు వెళ్తుంటుంది. గురుకుల పాఠశాలలో చదువుతున్న బాలిక గత నవంబర్‌లో ఇంటికి వచ్చింది. ఆ సమయంలో తండ్రి కూతురిపై కన్నేశాడు.  బాలికను తిరిగి పాఠశాలకు పంపకుండా ఇంటిపట్టునే ఉండనిచ్చాడు. తన భార్య కూలి పనులకు వెళ్లిన సమయంలో మద్యం మత్తులో ఇంటికి చేరుకుని ఒంటరిగా ఉన్న కూతురిపై అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు.



తండ్రి దాష్టీకాన్ని బాలిక ప్రతిఘటిస్తూనే ఉంది. అయితే ఆ కసాయి తండ్రి కత్తి చూపి చంపేస్తానని బెదిరించి లొంగదీసుకునేవాడు. కొన్ని రోజుల క్రితం అస్వస్థతకు లోనైన బాలికను అరకలగూడు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం బాలికకు ఐదు నెలల గర్భమని వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న తల్లి నిలదీస్తే తండ్రి చేసిన అఘాయిత్యాన్ని బాలిక చెప్పింది. గుట్టుచప్పుడు కాకుండా బాలికకు అబార్షన్ చేయించేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. అయితే  వైద్యులు నిరాకరించారు. విషయాన్ని తెలుసుకున్న గ్రామస్తులు బాలికకు అండగా నిలిచి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేశామని, బాధితురాలిని మహిళాశిశు సంక్షేమ శాఖకు అప్పగిస్తామని పోలీసులు  తెలిపారు.

...............ఇలాంటి వాడిని ఏమిచేయాలి ?
08:42 - By Unknown 1

narrowsidebarads

Post your AD here 300x250 AD TOP

...
© 2014 HOT NEWS. WP Theme-junkie converted by Bloggertheme9
Powered by Blogger.
back to top