Contact

Text

Monday, 9 June 2014

జగన్‌ చెప్పాడు... చంద్రబాబు చేశాడు...!

ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేసిన వెంటనే.. అయిదు సంతకాలు, ఆరు పనులతో రాష్ట్ర ప్రజల స్థితి గతులు మార్చేస్తానంటూ వైఎస్‌ జగన్మోహనరెడ్డి తన ఎన్నికల ప్రచారం సందర్భంగా పదేపదేహామీ ఇచ్చారు. అయితే ఆ మాట నిలబెట్టుకోవడానికి అనగా సీఎం అయిన వెంటనే అయిదు సంతకాలు చేసి ప్రజల జీవనగతుల్ని మార్చేయడానికి ప్రజలు ఆయనకు అవకాశం ఇవ్వలేదు. నారా చంద్రబాబునాయుడును గెలిపించారు. నారా చంద్రబాబునాయుడు తొలినుంచి రైతు రుణమాఫీ పథకం పై ముఖ్యమంత్రి అయ్యాక తొలిసంతకం చేస్తానంటూ ఊదరగొడుతూ వచ్చారు. ఇవాళ ఆదివారం సాయంత్రం 7.27 గంటలకు ఆయన పదవీ స్వీకార ప్రమాణం చేశారు. ఆ పిమ్మట జరిగిన బహిరంగ సభలో చంద్రబాబునాయుడు... ఏకంగా అయిదు తొలి సంతకాలు చేశారు. ఆయన చెప్పింది రైతు రుణమాఫీ అంశం ఒక్కటే అయినా.. జగన్‌ చెప్పిన తరహాలో అయిదు బిల్లుల మీద చంద్రబాబు సంతకాలు చేశారు. ఇవి అచ్చంగా జగన్‌ సంతకం చేస్తానన్న హామీలు కాదు గానీ.. జగన్‌ చెప్పిన తరహాలోనే చంద్రబాబు అయిదు సంతకాలు చేయడం అనేది కేవలం యాదృచ్ఛికం కావచ్చు.  అయితే రాష్ట్ర ప్రజలు యావత్తూ కీలకంగా ఎదురుచూస్తూ ఉన్న సంతకం.. రైతురుణమాఫీకి సంబంధించినది మాత్రమే. ఆ ఒక్క సంగతి ఆయన ఏం చేస్తారో...? ఎలాంటి మెలికలు పెడతారో..? రైతు రుణమాఫీని ఆచరణలోకి తీసుకువచ్చే విషయంలో ఎలాంటి మడతపేచీలు ఉంటాయో.. అనే భయంతోనే రాష్ట్ర ప్రజలు చంద్రబాబు పదవీస్వీకార ప్రమాణం కోసం ఎదురుచూశారంటే అతిశయోక్తి కాదు.  చంద్రబాబు తొలి సంతకం రైతు రుణమాఫీ పైనే చేశారు. అయితే ఈ విషయంలో ఆయన తన తెలివితేటల్ని ప్రదర్శించారు. నేరుగా రుణమాఫీ చేయకుండా.. రైతు రుణమాఫీకి సంబంధించి.. విధివిధానాలు ఖరారుచేసేందుకు ఒక కమిటీని ఏర్పాటుచేస్తూ ఆయన తొలి సంతకం చేశారు. అయితే ఈ కమిటీ ఎప్పటికి విధివిధానాలను తేలుస్తుందో ఇవాళ్టికి ఖరారు కాలేదు. ప్రజల మదిలో సందేహాలు, సందిగ్ధాలు మాత్రం తొలగలేదు.
 చంద్రబాబు చేసిన సంతకాల వివరాలు: 

1) రైతు రుణమాఫీకి విధివిధానాల రూపకల్పనకు కమిటీ ఏర్పాటు
 2) వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్ల పెంపు
 3) ఎన్టీఆర్‌ సుజల స్రవంతి పథకం
 4) మద్యం బెల్టుషాపుల రద్దు
 5) రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీవిరమణ వయోపరిమితి 58 నుంచి 60 ఏళ్లకు పెంపు.  

మొత్తానికి తన తొలి అయిదు సంతకాలతో.. రాష్ట్ర ప్రజల అనుమానాలు నివృత్తి చేయలేకపోయినా.. అభిమానాన్ని చూరగొనేందుకు ప్రయత్నిస్తున్నారు నారా చంద్రబాబునాయుడు. ఆయన ఎలాంటి మెలికలు లేని రుణమాఫీ అందించాలని ఆశిద్దాం. 
23:36 - By Unknown 0

పరిటాల హత్య ‘తవ్వకం’ పొలిటికల్‌ గేమ్‌


దివంగత టీడీపీ నేత పరిటాల రవీంద్ర హత్యకేసుని తెలుగుదేశం సర్కార్‌ తిరగతోడుతుందా.? ఈ ప్రశ్నకు ‘ఔను’ అనే సమాధానం వస్తోంది. చంద్రబాబు నిన్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేయడం, ఆయన మంత్రి వర్గంలో పరిటాల రవి సతీమణి పరిటాల సునీతకు అవకాశం దక్కడం తెల్సిన విషయాలే. అనంతపురం జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన పరిటాల రవి, ఫ్యాక్షన్‌ రాజకీయాల్లో భాగంగా హత్యకు గురయ్యారు. పరిటాల రవి హత్యకేసులో నిందితుడు మొద్దుశీను కూడా జైల్లో హతమయ్యాడు. హత్యకు రూపకల్పన చేశాడనే ఆరోపణలు ఎదుర్కొన్న మద్దెలచెరువు సూరి సైతం హత్యకు గురయ్యాడు. దాంతో ఈ కేసు తిరగతోడినా ఎవర్ని విచారించాలి.? అన్న దానిపై స్పష్టత లేనట్టే. అయితే, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌ ` పరిటాల రవి హత్యకు స్కెచ్‌ వేశారనే ఆరోపణలు అప్పట్లో విన్పించాయి. ఇవి కేవలం రాజకీయ ఆరోపణలేనని అప్పట్లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కొట్టి పారేశారు. సీబీఐ ఈ మేరకు వైఎస్‌ కుటుంబానికి క్లీన్‌ చిట్‌ కూడా ఇచ్చింది. ప్రభుత్వం మారింది.. పరిటాల రవి సతీమణి మంత్రి అయ్యారు.. ఆమె ఇప్పటిదాకా తనకు అన్యాయం జరిగిందనే చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో పరిటాల రవి హత్యకేసును తిరగతోడి, తద్వారా జగన్‌ని రాజకీయంగా ఇబ్బందుల్లో పెట్టాలనే ప్రయత్నాలైతే జరిగే అవకాశం సుస్పష్టం. మొత్తంగా చూస్తే ఇదో పొలిటికల్‌ గేమ్‌ అనే చెప్పొచ్చు. ఈ పొలిటికల్‌ గేమ్‌లో ఎలాంటి ఆసక్తికరమైన మలుపులుంటాయో వేచి చూడాల్సిందే. 
23:02 - By Unknown 0

Thursday, 5 June 2014

రేప్ లపై హైకోర్టు ముందు అర్ధనగ్న నిరసన


ఉత్తరప్రదేశ్ లో జరుగుతున్న అత్యాచారాలపై కేరళ మహిళలు తమదైన శైలిలో నిరసన వ్యక్తం చేశారు. ఐదుగురు మహిళా కార్యకర్తలు తొలుత నగ్నంగా మారి, తర్వాత కేవలం ఒక వస్త్రాన్ని తమ ఒంటిచుట్టూ కప్పుకొన్నారు. అది కూడా కేరళ హైకోర్టు ఎదురుగా!! 'స్త్రీ కూటైమ' (మహిళా గ్రూప్) అనే దళానికి చెందిన ఐదుగురు మహిళలు దేశ జాతీయ పతాకంలోని మూడువర్ణాలకు ప్రతీకగా ఆకుపచ్చ, తెలుపు, కాషాయరంగు వస్త్రాలను కప్పుకొని అత్యాచారాలను నిరోధించాలంటూ నినాదాలు చేశారు.

ఈ దళంలో మొత్తం 30 మంది మహిళలున్నారు. వీరిలో ఐదుగురు అర్ధనగ్నంగా నిరసన వ్యక్తం చేయగా, మిగిలినవారు నినాదాలు ఇచ్చారు. అయితే, కోర్టు ముందు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారని, అసభ్యంగా ప్రవర్తించారని, బహిరంగ ప్రదేశంలో న్యూసెన్స్ సృష్టించారని పోలీసులు ఈ ఐదుగురు మహిళలను అదుపులోకి తీసుకుని, తర్వాత వారిని బెయిల్ మీద విడిచిపెట్టారు.
10:20 - By Unknown 0

చెప్పుకోలేని చోట కొరికేసింది

ఆమెకు కోపం వచ్చింది. అలిగి కూచుంది. ఆయనకు పట్టుదల పెరిగింది. నువ్వు వండకపోతే నేనే వండుకుంటాను అంటూ వంటింట్లోకి వెళ్లాడు. నా వంటింట్లోకి నువ్వు వెళ్లొద్దంటూ ఆమె అడ్డం పడింది. అంతే ఇద్దరూ బాహాబాహీ ముష్టా ముష్టీ కొట్టుకున్నారు. 
 

ఆ పోరాటంలో ఆయన కట్టుకున్న టవల్ జారిపోయింది. ఆయన 'దివ్యమంగళరూపాన్ని' చూసిన ఆమెకు నషాళానికి అంటింది. అంతే కసక్కున కొరకరాని చోట కొరికేసింది. ఇదంతా మే 4 న మధ్యప్రదేశ్ లోని సత్నా జిల్లాలోని పాగ్రా గ్రామంలో జరిగింది. 
 
ఆయన పేరు జితేన్ పటేల్, ఆమె పేరు ఉమా పటేల్. వాళ్లిద్దరూ రెండేళ్లు ప్రేమించుకుని పెళ్లాడారు. పెళ్లి తరువాత ప్రేమ వికటించి ప్రేమ గాట్ల నుంచి కోపపు కాట్ల దాకా ఎదిగింది. అయితే బయట చెప్పుకుంటే పరువునష్టమని జితేన్ నెల రోజుల పాటు తనలోనే దాచుకున్నాడు. ఇప్పుడు ఆయనకు మొత్తం చీము పట్టేసింది. దాంతో తప్పనిసరై ఆస్పత్రికి వెళ్లడంతో అంతా బట్టబయలైంది.
 
ఇప్పుడు జితేన్ సర్జరీ చేయించుకుంటున్నారు. ఉమ కేసులను ఎదుర్కొంటోంది.
09:48 - By Unknown 0

కామాంధులతో పోరాడి గెలిచిన 19 ఏళ్ల బాలిక


న్యూఢిల్లీ: అత్యాచారం చేయడానికి యత్నించిన కొంతమంది దుండగులతో ధైర్యంగా పోరాడి గెలిచిందో బాలిక. దక్షిణ ఢిల్లీలోని ఫతేపూర్ బేరీ ప్రాంతంలో నీళ్లు పట్టుకునే క్రమంలో బావి దగ్గరకు వెళ్లిన ఓ బాలిక (19)పై ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేయబోయారు. ఆ క్రమంలోనే ఆ బాలిక ను బలవంతంగా అపహరించి దగ్గర్లోని అడవిలోకి తీసుకువెళ్లారు. అక్కడ ఆ ముగ్గురు కలిసి సామూహిక అత్యాచారం చేయడానికి యత్నించారు. కాగా ఆ యువతి వారిని ధైర్యంగా ప్రతిఘటించి అక్కడి నుంచి తప్పించుకుని ఇంటికి చేరింది. ఈ ఘటనపై తల్లి దండ్రులకు తెలపడంతో వారు పోలీస్ స్టేష్టన్ లో ఫిర్యాదు చేశారు. 
 
ఆ బాలిక గత రాత్రి 8 గం.లకు  నీళ్లు తెచ్చుకునేందుకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామన్నారు. ఈ ఘటనలో తలకు గాయాలైన ఆ యువతికి ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
09:39 - By Unknown 1

Wednesday, 4 June 2014

'ఆమె అతడిని...అతడు మరో ఆమెను'

తిరుపతి : ఓ ట్రయాంగిల్ లవ్ ఇద్దరి ప్రాణాల మీదకు తెచ్చిన ఘటన తిరుపతిలో చోటుచేసుకుంది. ఆమె అతడిని ప్రేమించింది. అతను మరో అమ్మాయిని ప్రేమించాడు. అది తెలిసి కూడా... ప్రియుడి కోసం ఆ యువతి గడపదాటి వచ్చింది. తనను పెళ్లి చేసుకోవాలంటూ రెండు రోజులు అతని వెంటే తిరిగింది. దాంతో ఆ యువతి కుటుంబ సభ్యులు తమ అమ్మాయిని కిడ్నాప్‌ చేశారంటూ అతడిపై ఫిర్యాదు చేశారు.



ఈ విషయం తెలుసుకున్న అతడు కంగారుపడి... తనకోసం  వచ్చిన ఆమెను ఇంటివద్ద వదిలిపెట్టేందుకు బయల్దేరాడు. అయితే రైలు దిగగానే.. అమ్మాయి బంధువులు కన్పించారు. అంతే  ఏమి చేయాలో వారిద్దరికి అర్థం కాలేదు... భయంతో పట్టాలపైకి దూకారు. అయితే అదే సమయంలో అటుగా వస్తున్న రైలు వారిని ఢీకొట్టింది. దీంతో అతడి కాళ్లు విరిగిపోగా, ఆమె గాయపడింది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే పలమనేరు మండలానికి చెందిన ప్రియ, గంగవరం మండలానికి చెందిన ప్రసాద్ బాబును రెండేళ్లుగా ప్రేమిస్తోంది. అయితే ప్రసాద్ బాబు మరో అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. రెండు రోజుల క్రితం ప్రియ ఇల్లు వదిలి ప్రసాద్‌ దగ్గరకు వచ్చింది. విషయం తెలుసుకున్న ప్రియ తల్లిదండ్రులు ప్రసాద్‌కు ఫోన్‌ చేసి... కేసు పెడతామని హెచ్చరించారు.

దీంతో ప్రియను ఇంటి దగ్గర వదిలి పెట్టేందుకు తిరుపతి వచ్చాడు. అదే సమయంలో రైల్వేస్టేషన్‌లో ప్రియ బంధువులు కన్పించటంతో భయపడిపోయిన ప్రియ, ప్రసాద్‌లు రైలుపట్టాలపైకి దూకారు. అటుగా వచ్చిన రైలు వారిని ఢీకొనటంతో ప్రసాద్‌ కాళ్లు తెగిపోగా... ప్రియకు గాయలయ్యాయి. ప్రస్తుతం వీరిద్దరూ రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
07:06 - By Unknown 0

narrowsidebarads

Post your AD here 300x250 AD TOP

...
© 2014 HOT NEWS. WP Theme-junkie converted by Bloggertheme9
Powered by Blogger.
back to top